బిగ్ బాస్ సీజన్ 3 మరో నాలుగు వారాల్లో ముగుస్తుందని తెలిసిందే. వారాలు గడుస్తున్నా కొద్ది టైటిల్ రేసులో నిలిచే ఇంటి సభ్యుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ 3 మరో నెల రోజుల్లో ముగుస్తుంది. ఇక సీజన్ 1 నుండి సీజన్ 2, ఆ తర్వాత సీజన్ 3 ఇలా సీజన్ సీజన్ కు ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది.


అయితే బిగ్ బాస్ సీజన్ 4కి అంత లేట్ చేయకుండా ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే సీజన్ 3 కోసం కష్టపడినట్టు కాకుండా బిగ్ బాస్ సీజన్ 4కి ముందు నుండే ప్లాన్ చేస్తున్నారట. స్టార్ హీరోల సినిమాలు.. షెడ్యూళ్లను బట్టి ఎవరు నెక్స్ట్ ఇయర్ జూన్, జూలైలో ఖాళీగా ఉంటారో వారితోనే ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నారట.


ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట స్టార్ మా, బిగ్ బాస్ నిర్వాహకులు. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా రెండో సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. ఇక మూడవ సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ షో నడిపిస్తున్నాడు.


ఇక సీజన్ 4కి ఏ స్టార్ సర్ ప్రైజ్ చేస్తాడని ఆడియెన్స్ లో ఎక్సైటింగ్ గా ఉన్నారు. అసలైతే మిగతా భాషల్లో అన్ని సీజన్లకు హోస్ట్ ఒకడే బాలీవుడ్ లో 13 సీజన్లకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తే బుల్లితెర ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ హోస్ట్ గా అల్లు అర్జున్ కన్ఫాం అంటున్నారు. మరి అల్లు అర్జున్ నిజంగా బిగ్ బాస్ హోస్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: