టాలీవుడ్ అందాల హీరో మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ సపరేట్. మహేష్ బాబు గొప్ప అందగాడు అమ్మాయిలకు కలల రాకుమారుడు. అందుకే ఆయనకు అమ్మాయిల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు మహేష్ బాబు. వరుస హిట్లతో ప్రేక్షకులను మెప్పిస్తూ...  విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్య జరిగిన సర్వేలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా కూడా మహేష్ బాబే  ఉన్నాడన్న విషయం  తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు.

 

 

 

 

 ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో డైనమిక్ స్టార్ విజయశాంతి, విలక్షణ నటులు  ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు   కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. అయితే మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో  అందరికీ తెలిసిన విషయమే. చిన్న బ్రేక్ దొరికిన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటాడు. ఛాన్స్  దొరికినప్పుడల్లా అవుటింగ్ వెళ్తూ   ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు  మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే దసరా పండుగ సందర్భంగా మహేష్ బాబు కు కాస్త బ్రేక్ దొరకడంతో ... ఫ్యామిలీతో కలిసి స్విజర్లాండ్ కి  చేరిపోయాడు.

 

 

 

 

 

 దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ బాబు... ఈ భూమి మీద నాకు ఇష్టమైన ప్రాంతం స్విస్ ఆల్ఫ్ అని తెలిపాడు.  దసరా సందర్భంగా వచ్చిన బ్రేక్  తో  ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా అంటూ మహేష్ బాబు ట్విట్  చేసాడు. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ తిరిగి వస్తా అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే దసరా పండుగ సందర్భంగా స్విట్జర్లాండ్లో సితార గౌతమ్ భార్య నమ్రతతో  తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. స్విడ్జర్ల్యాండ్ లోని స్విస్ ఆల్ఫ్  కు వెళ్ళిన మహేష్ బాబు ఫ్యామిలీ తో  ఒక సెల్ఫీ క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా  ఇది నెట్టింట్లో  బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: