అత్యంత భారీ అంచనాలతో ఈ సంవత్సరం వచ్చిన ‘సాహో’ ‘సైరా’ లు అనుకున్న స్థాయిలో రికార్డులు సృష్టించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితులలో వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ తప్ప మరే అత్యంత భారీ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో లేదు అన్న విషయం సుస్పష్టం. 

ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు పరాజయం అన్న పదాన్ని వినని రాజమౌళి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడమే కాకుండా ఈ మూవీ కథ విషయంలో కూడ రాజమౌళి ఆలోచనలలో మార్పులు వచ్చినట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ కథ స్వాతంత్రోద్యమ నేపధ్యంలో ఒక చైల్డ్ సెంటిమెంట్ తో కీలక మలుపు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా జూనియర్ కొమరం భీమ్ గా నటిస్తున్న నేపధ్యంలో ఈ రెండు పాత్రలను రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఎక్కడ కలుపుతాడు అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. 

ఇప్పుడు దీనికి సంబంధించి ఒక లీక్ బయటకు వచ్చింది. ఒక చిన్న పాపను కాపాడే ఎపిసోడ్ ఈ మూవీకి కీలకం అవుతుందని ఆ పాపను కాపాడటం కోసం చరణ్ జూనియర్ లు కలవడంతో పాటు వారిద్దరూ బ్రిటీష్ వారిని ఎదిరించే విప్లవ యోధులుగా మారే టర్నింగ్ ఈ మూవీ కథలో రాజమౌళి ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి ప్రస్తుతం చలామణిలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ బదులు అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఒక మంచి టైటిల్ గురించి రాజమౌళి అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: