దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 జులై 30వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్ రామ రావణ రాజ్యం అని కొంతమంది వేరే టైటిల్ అని కొందరు గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ టైటిల్ రామ రౌద్ర రిషితం అని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ హీరోలు, దర్శక నిర్మాతలు ఈ టైటిల్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. విదేశాల్లో మాత్రం రైజ్ రివోల్ట్ రివేంజ్ అనే పేరుతో విడుదల చేస్తారని సమాచారం. 
 
దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీయార్ ఫస్ట్ లుక్ ఈ నెల 22వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు జోడీగా హీరోయిన్ ఫైనల్ అయినప్పటికీ చిత్ర యూనిట్ అధికారికంగా హీరోయిన్ గురించి ప్రకటించటం లేదు. 
 
స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఒకే కాలానికి చెందిన వారు అయినప్పటికీ వారి పోరాటం వేరువేరుగా చేశారు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ఉంటే ఏ విధంగా ఉంటుందనే కల్పితమైన కథతో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి2 సాధించిన రికార్డులను చెరిపివేసి ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: