కొందరికి సినిమా అంటే ఎంతగా పిచ్చి వుంటుందంటే దానికోసం ఎంతకైన తెగిస్తారు,ఎంత దూరమైనా వెళ్లుతారు.ఈ సినిమా పిచ్చి అనేది ఒక్కోసారి మనిషిని పిచ్చోన్ని చేస్తుంది.ఈ సినిమా మాయలో పడిన ఎందరో యువతులు తమ శీలాలు కోల్పోయి వ్యభిచారులుగా మిగిలారు,మరికొందరు జీవితాలను నాశనం చేసుకుని,అర్దాంతరంగా ఆత్మహత్యలు చేసుకుని ఈలోకం నుండే వెళ్లిపోయారు.


ఇంకా దొంగలుగా కూడ మారి జైలుపాలు అయ్యారు.ఈ రంగుల కల వెనుక దాగివున్న చీకటి నీడలను అర్ధం చేసుకోక ఆశపడి సినిమా అనేది ఓ బంగారులోకం అని భ్రమ పడుతారు.ఇదే ప్రపంచం అని అనుకుంటారు.ఇలా చెప్పలేనంతగా సినిమాలకు ప్రభావితమైన ఓ వ్యక్తి జీవితం దొంగలా మారడానికి ప్రేరేపించింది.ఎంతలా అంటే 18 ఏళ్ల వయసుకే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.పెద్దగా చదువుకోలేదు కానీ దొంగతనానికి స్కెచ్ వేసాడంటే మాత్రం పక్కాగా జరిగిపోవాల్సిందే..


అలా దొంగతనాలు చేసి మరి సినిమాలకి ప్రొడక్షన్ చేసాడు.తాజాగా తమిళనాడులోని తిరుచ్చి లలిత జ్యూవెలరి దొంగతనంలో ఇతడే ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేటుగాడి కోసం గాలిస్తున్నారట కూడా.ఇక ఇప్పటికే ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పలు కేసులు నమోదు చేసారు. అయితే ఇతనికి దొంగతనంతో పాటు సినిమా అంటే పిచ్చి కూడా ఉంది.


దొంగతనాలు చేసిన డబ్బుతో సినిమాలు చేయాలనీ అనుకున్నాడు. వెంటనే తన మకాం హైదరబాద్ కి మార్చి 'బాలమురుగున్' ప్రొడక్షన్ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసాడు.అందులో భాగంగానే ' మనసా వినవే', ఆత్మ సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు.ఇక ఇతడిపై పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు కూడా ఇతగాడి కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఏమి బాగులేదని ఓ వ్యాన్ లో సంచార జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. చూసారా లగ్జరీగా జీవించాలని చేసిన తప్పుడు పనులు అతని జీవితాన్ని ఎలాంటి మురికి కూపంలోకి నెట్టాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: