17 సంవత్సరాల క్రితం మలయాళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది నయనతార. తమిళంలో, తెలుగులో వరుస అవకాశాలతో
నయనతార స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి హిట్లు కొట్టిన నయనతారను తమిళనాడులోని అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకుంటారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్
నయనతార కావటం విశేషం.
కానీ నయనతారపై గత కొన్నేళ్లుగా కొన్ని విమర్శలు వస్తూనే ఉన్నాయి.
నయనతార నటించే సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మరియు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాదని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన
సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రమోషన్లకు
నయనతార వస్తుందని భావించినా
నయనతార ప్రమోషన్లకు హాజరు కాలేదు. తెలుగులో, తమిళంలో
నయనతార నటించిన ఏ సినిమా ప్రమోషన్లకు హాజరు కావటం లేదు.
తనపై ఇలా విమర్శలు వస్తూ ఉండటంతో
నయనతార ప్రమోషన్లకు హాజరు కాకపోవటానికి కారణం తన సన్నిహితులకు చెప్పిందని తెలుస్తోంది.
నయనతార ఏ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ప్రమోషన్లలో పాల్గొంటే ఆ సినిమాలు ఎక్కువ శాతం ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్నాయట. ఈ సెంటిమెంట్ వలన
నయనతార సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మరియు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉందని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి తేదీ ఖరారైనట్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరి వివాహం విదేశాల్లో జరగబోతుందని కూడా వార్తలు వినిపించాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా పెళ్లి వార్తలపై స్పందించాడు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన మాత్రం లేదని, ఇంతకుమించి వివరించి చెప్పటం కుదరదని విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. విఘ్నేష్ శివన్ ప్రకటనతో
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లు ఆగిపోయే అవకాశం ఉంది.