మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా మామూలుగా లేదు. నాలుగో రోజు కూడా సైరా అక్క‌డ స్ట్రాంగ్‌గా ఉంది. శనివారం ఈ మూవీ 2.56 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే మూడు రోజులకు గానూ 14.5 కోట్ల షేర్ సాధించింది. ఓవ‌రాల్‌గా నాలుగు రోజుల‌కు సైరా అక్క‌డ రు. 17.20 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇదంతా షేర్ మాత్ర‌మే కావ‌డం విశేషం. ఇక ఈ రోజు ఆదివారం కావ‌డంతో వ‌సూళ్లు మ‌రింత స్ట్రాంగ్‌గా ఉంటాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


ఐదు రోజుల‌కే అక్క‌డ‌ సైరా 20 కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే సైరా రు.30 కోట్లకు పైగా నైజాం థియేట్రిక‌ల్ బిజినెస్ చేసిన నేప‌థ్యంలో మ‌రో రు.10 కోట్ల‌కు పైగా షేర్ వ‌స్తేనే నైజాంలో బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చిన‌ట్ల‌వుతుంది. ఇక మ‌రో ఐదారు రోజుల వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ఉన్న నేప‌థ్యంలో సైరకు వ‌చ్చిన ఇబ్బంది అయితే ఉండ‌దు. అయితే కొన్ని చోట్ల గోపీచంద్ చాణ‌క్య సినిమాకు థియేట‌ర్లు కేటాయించ‌డంతో మాస్ ఫ్యాన్స్ ఆ సినిమా వైపు కూడా చూస్తున్నారు.


ఇక నైజాంను మిన‌హాయిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాలలో కూడా సైరా వసూళ్లు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. తెలుగు స్టేట్స్‌ను మిన‌హాయిస్తే మిగిలిన భాష‌ల్లో మాత్రం సైరాకు న‌ష్టాలు త‌ప్పేలా లేవు. హిందీ, త‌మిళ్‌, కేర‌ళ‌లో సైరా ఆశించిన మేర క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేదు.


ఇక మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేయగా నయనతార, తమన్నా ఆయన సరనస హీరోయిన్స్ గా నటించారు. జగపతి బాబు, సుదీప్, అమితాబ్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: