ఎలాంటి పాత్రలోనైనా తనఎలాంటి పాత్రలోనైనా తన విలక్షణమైన నటనతో మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్. అయితే భిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ప్రకాష్ రాజ్. తనదైన నటనతో పాత్రకి ప్రాణం పోయగల గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సత్తా ప్రకాష్ రాజ్ సొంతం.ఇప్పటికే తన సినీ కెరియర్ లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు.ఒక పవర్ ఫుల్ విలన్ గా...ఒక తాత గా... ఒక కమిడియన్ గా...ఒక గురువుగా...ఒక నాన్నగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు చెయ్యని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. 

 

 

 

 

అందుకే ముఖ్య పాత్రలు అన్నింటికీ దర్శకులకు వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ప్రకాష్ రాజ్. అయితే ప్రస్తుతం విలక్షణ నటుడు ప్రకాష్ ఓ సినిమాలో తాను చేసిన పాత్రనే 22 ఏళ్ళ తర్వాత మరో సారి చేయబోతున్నారు. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం లో ప్రకాష్ రాజ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ప్రకాష్ 22 ఏళ్ళ క్రితం కూడా ఇద్దరు అనే సినిమాలో కరుణనిది పాత్ర లో నటించి మెప్పించాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.కాగా ఇద్దరు సినిమా విడుదల అయ్యింది.

 

 

 

కాగా 22 ఏళ్ళ క్రితం నటించిన పాత్రలోనే మళ్లీ నటించేందుకు ఛాన్స్ రావటంతో ప్రకాష్ రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో జయలలిత పాత్రలో... బాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ నటి కంగనా రనౌత్ నటిస్తుంది. కాగా యంజిఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు.చాలా మంది ముఖ్య నటులు నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. కాగా తెలుగులో మహేష్ సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు ప్రకాష్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: