స్టార్ మా లో ప్రసారమవుతున్న ది  బిగ్గెస్ట్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 3 ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లో రసవత్తరంగా సాగుతుంది. టాస్క్ లు,  నామినేషన్లు,  వారంతంలో ఎలిమినేషన్ లు,  మద్య మధ్యలో  కాంట్రవర్షియల్ గొడవలు  ఇలా బిగ్ బాస్3 షో అందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. అయితే బిగ్ బాస్3 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతి శని ఆదివారాల్లో ప్రేక్షకులందరినీ మాయ చేసేస్తున్నాడు. కంటెస్టెంట్స్ తీరుకు ఎన్నో వార్నింగ్ లు కూడా ఇస్తున్నాడు నాగార్జున. 

 

 

 

 

 

 అయితే ప్రస్తుతం బిగ్ బాస్  తెలుగు రియాల్టీ షో 12వ వారానికి చేరుకుంది. ఎప్పటిలాగే నాగార్జున వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే నాగార్జున  ప్రతి ఆదివారం ఎవర్నో ఒకర్ని హౌస్ నుంచి బయటకు పంపిస్తాడన్న  విషయం తెలిసిందే . అయితే ఎలివేషన్ లో  రాహుల్ పునర్నవి వరుణ్ సందేశ్ మహేష్ విట్టా  ఉన్నారు. అయితే ఇప్పటికే శనివారం జరిగిన ఎపిసోడ్ లో రాహుల్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే ప్రస్తుతం నామినేషన్ లో  ఉన్నది పునర్నవి మహేష్ విట్ట వరుణ్ సందేశ్. 

 

 

 

 

 

అయితే ఈ వారం మహేష్ విట్ట బిగ్ బాస్ 3 హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ రోజు మాత్రం మహేష్ బిగ్ బాస్ 3 హౌస్ లోనే ఉండబోతున్నాడని  పునర్నవి బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతుందని జోరుగా ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడికె పునర్నవి  బయటకు వచ్చేసిందని ఓ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో  కన్ఫామ్ గా తెలియాలంటే ఈరోజు  బిగ్ బాస్3 ఎపిసోడ్  చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: