మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ సభ అత్యంత ఘనంగా జరిగింది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో 9 అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహా ఆవిష్కరణ కోసం   చిరంజీవి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు    విమానాశ్రయంలో చిరంజీవికి పలు పార్టీలకు సంబంధించిన కీలక నేతలతో పాటు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరంజీవి తాడేపల్లి గూడెం చేరుకున్న దృశ్యం ఒక పొలిటికల్ రోడ్ షోలా జరిగింది అన్నవార్తలు వస్తున్నాయి. సుమారు 45 నిముషాలకు పైగా చిరంజీవి తన ప్రసంగం లోఎస్వీ రంగారావును ప్రశంసిస్తూ ఉద్వేగ పూరితంగామాట్లాడాడు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 120 మంది పోలీసు సిబ్బందితో చిరంజీవికి భారీ బందోబస్తు నిర్వహించడం చిరంజీవి స్టామినాను సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

‘సైరా’ పరిస్థితి ఎలా ఉన్నా ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు తప్పవు అని సంకేతాలు వస్తున్నా ఈ విషయాలను పట్టిచుకోకుండా చిరజీవి ఈరోజు నిర్వహించిన రోడ్ షోను బట్టి ‘సైరా’ ఫలితం చిరంజీవి దూకుడుకు ఏమాత్రం బ్రేక్ వేయలేదన్న విషయం స్పష్టం అవుతోంది.
సైరా’ ఫలితం ఎలా ఉన్నా  చిరంజీవి మెగా రోడ్ షో సక్సస్స్ కావడంతో మెగా అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే ఈ పరిణామాలు పరిశీలుస్తున్న విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలు అన్నీ మెగా పవర్ ను అందరికి గుర్తుకు చేయాడానికి అవసరం అనుకుంటే తిరిగి తాను రాజకీయాలలోకి రాగలను అని చెప్పడానికి అనుసరిస్తున్న వ్యూహం అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: