మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చినా నిన్నటి నుండి ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ సెలవుల్లో భారీగా కలెక్షన్లను సాధిస్తే మాత్రమే సైరా  బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉంది. 
 
సైరా సినిమా టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ , మల్లూవుడ్ లలో కూడా విడుదలైంది. కానీ ఈ సినిమాకు ఎందుకో మిగతా ప్రాంతాలలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావటం లేదు. సైరా సినిమాకు 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్  160 కోట్ల రూపాయలు మాత్రమే చేసింది. శాటిలైట్, డిజిటల్ హక్కులు కలిపినా సినిమాను నష్టాలతోనే విడుదల చేశారని తెలుస్తోంది. 
 
మరో నాలుగు రోజులు ఆగితే సైరా సినిమా ఫైనల్ రేంజ్ ఏమిటన్నది తెలిసిపోతుంది. నిర్మాత రామ్ చరణ్ కు మాత్రం భారీ స్థాయిలో కాకపోయినా నష్టాలు మాత్రం తప్పవని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన ఈ సినిమా ఎందుకో మిగతా ప్రాంతాల ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. వార్, జోకర్ సినిమాలు కూడా సైరా కలెక్షన్లు తగ్గటానికి కొంతవరకు కారణమయ్యాయని తెలుస్తోంది. 
 
టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన సాహో, సైరా ఆశించిన స్థాయిలో ఫలితాల్ని అందుకోకపోవటంతో టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలకు కొంతకాలం బ్రేక్ పడే అవకాశం ఐతే ఉంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: