రాజమౌళి అంటేనే గ్రేట్ డైరెక్టర్ అంటారంతా. చిన్న వయసులోనే పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే ఇంటెర్నేషనల్ డైరెక్టర్ అయ్యాడు. బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీని తీసి తెలుగు జెండాను ఖండాంతరాలకు ఎగురవేశాడు. రాజమౌళి జాతకం ఏంటో కానీ ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. ఇప్పటివరకూ అపజయం ఆయన్ని పలకరించలేదు. ఇక సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.


రాజమౌళిని బీట్ చేద్దామనుకున్న వారంతా వెనక వరసలోకే వెళ్ళిపోతున్నారు. తెలుగు సినిమా బౌండరీలు దాటించి బాలీవుడ్ దాకా మూవీ బంతిని పరుగులు తీయించిన బాహుబలిగా రాజమౌళిని  చెప్పాలి. ఇక రాజమౌళిలో మరో గొప్ప విశేషం ఏంటంటే తన సినిమాను ఖండాంతరాలకు కూడా చేర్చాడు. రాజమౌళి మ్యాజిక్ ని ఇపుడు ఎవరూ రిపీట్ చేయలేకపోతున్నారు.


హీరోలు కానీ డైరెక్టర్లు కానీ రాజమౌళి ఫీట్ ని అందుకోవడం దుస్సాహసమేనని చెప్పాలి. ఒక తెలుగు సినిమాను అన్ని భాషల వారు చూసేలా చేయడం అంటే కష్టమైన వ్యవహారం. ఆ విషయాన్ని సాహో, సైరా మూవీలు రుజువు చేశాయి. ఈ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పుకున్నా కూడా బంతి బౌండరీలు దాటలేకపోయింది.


ఇక ఇపుడు మిగిలిన ఒక్క ఆశ మళ్ళీ రాజమౌళి మాత్రమే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో మళ్ళీ రికార్డులు బ్రేక్ చేస్తాడని అంతా ఆశగా చూస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్, బాగుబలి ది కంక్లూషన్ మూవీస్తో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్న రాజమౌళి ఇపుడు ఆర్ ఆర్ ఆర్ తో  కొత్త రికార్డులు క్రియేట్ చేయగల సిధ్ధహస్తుడని అంటున్నారు. మొత్తానికి పాన్ ఇండియా మూవీకి రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అని అతా ఒప్పుకున్నట్లైంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్ని విన్యాసాలు చేస్తాడో.



మరింత సమాచారం తెలుసుకోండి: