సినిమాలకు రాజకీయాలకు చాలా లింకులు ఉంటాయి.  సినిమాల్లో రాణించిన వ్యక్తులు రాజకీయాల్లోకి వెళ్తుంటారు.  సినిమాల్లో రాణిస్తే జనాల్లో పాపులారిటీ పేరుంటుంది.  రాజకీయాల్లోకి వెళ్తే పవర్ వస్తుంది.  చేతిలో పవర్ ఉంటె.. ఎలాంటి పనులైనా సరే క్షణాల్లో జరిగిపోతుంటాయి.  అందుకే చేతిలో పవర్ కోసం ప్రతి ఒక్కరు పాకులాడుతుంటారు.  మాములుగా కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదగాలంటే సమయం పడుతుంది.  


అదే సినిమా రంగంలో ఎదిగి.. రాజకీయాల్లోకి వెళ్తే అది డైరెక్ట్ మార్గం.. రాజమార్గం.  అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.  ఒక్కోసారి సినిమా రంగంలో రాణిస్తున్న వ్యక్తులకు అదృష్టం ఏ రూపంలో వస్తుందో చెప్పలేము.   అందుకు ఓ ఉదాహరణ కుట్టి రాధికా.  కన్నడ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నేత కుమారస్వామి ఆమెపై మనసు పడ్డాడు.  


రహస్యంగా వివాహం చేసుకున్నారు.  కుమారస్వామి ఆమెను వివాహం చేసుకున్నాక, ఆమె సినిమాల్లో నటించడం పక్కన పెట్టింది.  సినిమాలకు ప్రొడ్యూసర్ గా మారి నిర్మించడం మొదలుపెట్టింది.  అయితే, కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోగానే కుట్టి రాధికా సినిమా ఇండస్ట్రీలో ముఖానికి మేకప్ వేసుకుంది.  దమయంతి పేరుతో సినిమా చేసింది.  


మాములుగా ఇందులో అనుష్క నటించాల్సి ఉంది.  కానీ, రాధికా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపడంతో అనుష్కను పక్కన పెట్టారు. కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో దమయంతిగాను, తెలుగులో సంహారిణిగాను పేరు పెట్టారు.  ఐదు భాషల్లో నిర్మితమౌతున్న ఈ సినిమాను కుట్టి రాధికా సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు.  నవరసన్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవలే రిలీజయిన టీజర్ చూసేందుకు అరుంధతిలా భయపెట్టే విధంగా ఉంది.  రాధికా గెటప్ కూడా భయానకంగా ఉంది.  సినిమా మరో అరుంధతి అవుతుందా అంటే అవుననే అంటున్నారు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: