టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్లి పోతున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు వెనకాల భార్య నమ్రత ప్రోద్బలం కూడా ఎక్కువగానే ఉంటుంది అని చాలా సందర్భాలలో మహేష్ చెప్పటం జరిగింది. తన సినిమా బాగుందో లేదో సూటిగా ఏ మొహమాటం లేకుండా భార్య నమ్రత చెప్పేస్తుంది అంటూ మహేష్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు ఒకపక్క వ్యాపార రంగంలో కూడా దూసుకెళుతూ మరోపక్క సామాజికంగా కూడా సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఖచ్చితంగా తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ప్రపంచ టూర్ లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాడు మహేష్.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా పో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి జీవితం హ్యాపీగా ఉండటానికి గల సీక్రెట్ ఒకటి బయట పెట్టారు. మహేష్ చెప్పిన సీక్రెట్..."నమ్రత నేను ఒకరినొకరం బాగా అర్ధం చేసుకున్నాం. మా పెళ్లి జరిగి 14 ఏళ్ళవుతోంది. వివాహ బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఓకే ఒక్క సీక్రెట్ ఉంది. అది ఫాలో అయితే చాలు. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. నేను అదే చేస్తున్నా. నా తండ్రి నుంచి ఈ విషయాన్నీ నేర్చుకున్నా. ఆయన కూడా ఇంటికి రాగానే కుటుంబంతో కలిసిపోయేవారు. టాప్ స్టార్ హీరో అనే హోదాను మరచి మాకు సమయాన్ని కేటాయించేవారు.


ఆయన నేర్పిన బాటలోనే నేను కూడా నడుస్తున్నాను" అని మహేష్ తన ఫ్యామిలీ గురించి వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: