ఎస్.ఎస్.రాజమౌళి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన మగధీర చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పాలి. కేవలం రెండవ సినిమాకే చరణ్ ని ఆకాశానికి ఎత్తేసింది ఈ సినిమా. అలాంటి సినిమా చరణ్ నుంచి మళ్ళీ రాలేదు. ఇక తారక్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడమే కాదు జక్కన్న కి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమాతో తారక్ స్టార్ హీరో అవుతాడన్న నమ్మకం కలిగేలా ప్రజెంట్ చేశారు జక్కన్న. ఆ తర్వాత యమదొంగ తారక్ కెరీర్ లో బెస్ట్ సినిమా. ఇక ఈ ఇద్దరి టాలీవుడ్ స్టార్స్ తారక్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ లో తారక్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిని అలరించడానికి థియేటర్లలోకి వస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఎప్పుడు ఒక్కటి అవుతారు? ఎప్పుడు ఒక్కటై పోరుబాట నడుస్తారు? అన్న పాయింట్ మీద ఇంట్రస్టింగ్ గాసిప్ ఒకటి బాగా వినిపిస్తోంది.

ఓ చిన్న పాపను కాపాడే ఎపిసోడ్ ఆర్ ఆర్ ఆర్ లో చాలా కీలకంగా వుంటుందని లేటెస్ట్ న్యూస్. ఎన్టీఆర్ ప్రాణాలకు తెగించి, ఆ పాపను కాపాడడంతో, రామ్ చరణ్ తారక్ తో చేతులు కలిపి, పోరుబాటకు దిగుతాడట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రన్స్ పులితో ఫైట్ వుంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే సినిమాలో మూడు లేద నాలుగు పాటలకు మించి వుండవు అన్నసంగతీ కూడా తెలిసిందే.

ఇక ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ కు ఫ్యాన్స్ నుంచి, సినిమా అభిమానుల నుంచి ఎబ్రివేషన్, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి వందలాది టైటిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ఆర్ ఆర్ ఆర్ అంటే ఏదో ఒకటి సెట్ అవుతోంది కానీ, తెలుగులోనే కష్టంగా వున్నట్లు చిత్ర అంటోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ కన్‌ఫర్మ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఇక తారక్ మళ్ళీ త్రివిక్రం తో జతకట్టబోతున్నాడని తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: