స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ 3 తెలుగు షో టెలివిజన్ చరిత్రలోనే టాప్ రేటింగ్ దూసుకుపోతుంది .టాస్కులు  కాంట్రవర్సీ గొడవలతో  బిగ్ బాస్ 3 షో టెలివిజన్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది . అయితే బిగ్ బాస్3 హౌస్ లో మంచోడిగా పేరుతెచ్చుకున్న రవికృష్ణ... గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రవికృష్ణ ఎలిమినేట్ అవడంతో మంచోడు మంచోడు అంటే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ రవి కృష్ణని ముంచారని  చాలా ట్రోల్స్  కూడా వచ్చాయి. అయితే గత వారం ఎలిమినేట్ అయిన రవికృష్ణ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పునర్నవి రిలేషన్ షిప్ పై  పలు ఆసక్తికర వ్యాఖ్యలు. 

 

 

 

 

 రాహుల్ పునర్నవి మధ్య  అసలు ఏ రిలేషన్ షిప్ లేదని కేవలం రాహుల్ గేమ్ లో తను  ఉండడం కోసమే  పునర్నవి  తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చేస్తున్నాడని నిజానికి వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. అయితే మొదట పునర్నవి కి తనకు మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఉండేదని తెలిపిన రవికృష్ణ ... అది చూసి రాహుల్ జీర్ణించుకోలేక ... తనపై పునర్నవి  ఏదో చెప్పి తమ మధ్య కోల్డ్ వార్ కి తెలిపాడని రవికృష్ణ తెలిపారు. రాహుల్ తన గురించి ఏం చెప్పాడు అనే దాన్ని  బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు దయచేసి చూపించాలని... పునర్నవి తనతో మాట్లాడక  పోవడానికి కారణం తనకు  అప్పుడు అర్థమైందని రాధాకృష్ణ తెలిపాడు. 

 

 

 

 

 అయితే హౌస్ లో శివజ్యోతి తో  మాత్రమే కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వాడినని  రాధాకృష్ణ తెలిపాడు. ఇదిలా ఉండగా ఈవారం పునర్నవి,  మహేష్ విట్ట,  వరుణ్ సందేశ్, రాహుల్  నామినేషన్ల ఉండగా...రాహుల్ ఇప్పటికే సేవ్ అయ్యాడు. కాగా  ఈ వారం బిగ్ బాస్3 హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్తారు  అనేది నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది. కాగా మహేష్ విట్ట,  పునర్నవి  వీరిద్దరిలో ఎవరు ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: