సినిమా ప్రియులకు టాలీవుడ్లో సంక్రాంతి తర్వాత పెద్ద పండుగ దసరా. సంక్రాంతి పండగ వచ్చిందంటే థియేటర్లన్నీ చిన్న.. పెద్ద అ సినిమాలతో కళకళలాడుతూ ఉంటాయి. గత నాలుగేళ్లుగా చూస్తే సంక్రాంతికి పెద్ద హీరోలు... మీడియం రేంజ్ హీరోలు పోటాపోటీగా తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో దసరాకు అంతే క్రేజ్ ఉంది. గత రెండు మూడేళ్ళుగా తెలుగులో దసరాకు సైతం క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించి సత్తా చాటాయి.


ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు మరో యంగ్ హీరో గోపీచంద్ నటించిన చాణ‌క్య‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల- నవీన్ ఊరంతా అనుకుంటున్నారు సినిమా సైతం రిలీజ్ అయింది. ఈ మూడు సినిమాల్లో ఊరంతా అనుకుంటున్నారు సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గోపీచంద్ చాణ‌క్య‌ సైతం గోపీచంద్ కు తగిన రేంజ్ హిట్ టాక్‌ తెచ్చుకోలేక పోయింది.


త‌మిళ‌ దర్శకుడు తిరు కథనంలో ట్విస్ట్‌లు లేకుండా ఫ్లాట్గా సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఊరంతా అనుకుంటున్నారు సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా సైతం సాగతీత సన్నివేశాలతో ప్రేక్షకులను విసుగెత్తించే ఉందంటున్నారు. ఇక మెగాస్టార్ సైరా సినిమా హిట్ అయినా వసూళ్లు లేవు. ఇక తెలంగాణ‌లో బతుకమ్మ పండుగ తో పాటు... జోరుగా వర్షాలు పడటం కూడా ఈసారి దసరా టాలీవుడ్ సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.


సైరా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎంత మాత్రం లేవు. ఏదేమైనా ఈ ద‌స‌రా టాలీవుడ్‌కు ఎంత మాత్రం క‌లిసి రాలేదు. ప్రేక్ష‌కుల‌తో పాటు అంద‌రిని నిరాశ‌లో ముంచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: