దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో రికార్డులు తిరగరాసిన బాహుబలి సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైవ్ లో ఆర్కెస్ట్రా చేయబోతున్నారు. నిజంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం అని చెప్పక తప్పదు. బాహుబలి - ది బిగినింగ్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైవ్ కంపోజ్ చేయబోతున్నారు. ఈ ప్రఖ్యాత వేదిక పై లైవ్ ఆర్కెస్ట్రా జరుపుకోనున్న మొట్ట మొదటి నాన్-ఇంగ్లిష్ సినిమా బాహుబలి మాత్రమే కావడం విశేషం. సినిమా స్క్రీనింగ్ తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుందనే విషయాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రకటించారు.

అక్టోబర్ 19న జరగనున్న ఈ కార్యక్రమానికి బాహుబలి టీమ్ అంతా వెళ్ళనున్నారు. అలా బాహుబలి సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క మరోసారి కలవబోతుండటం మరో ఆసక్తికరమైన విషయం. రాజమౌళి తెరకెక్కించిన మన తెలుగు సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల్నే కాదు, విదేశీ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. అలా రాయల్ ఆల్బర్ట్ హాల్ కమిటీని కూడా ఈ సినిమా ఆకర్షించింది. అందుకే తొలిసారిగా ఇంగ్లిష్ కాకుండా, మరో భాషకు చెందిన బాహుబలిని ఎంపిక చేశారు. ఇప్పుడిది తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది. 

అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రదర్శన ఉచితం మాత్రంకాదు. టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాలి. వీటి ధరలు 14 పౌండ్ల నుంచి 88 పౌండ్ల వరకు ఉన్నాయి. ప్రదర్శన తర్వాత సినిమా యూనిట్ తో ఇంటరాక్షన్ కూడా ఉంటుందని తాజా సమాచారం. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, కీరవాణి.. ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ఇక ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతమందించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఇంత పాపులారిటి రావడం నిజంగా ఊహించనిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: