డ్రగ్స్ ఇష్యూస్, కాస్టింగ్ కౌచ్..ఇలా రకరకాల వివాదాలు.. కోర్టు కేసులు టాలీవుడ్ ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా సైరా .. వాల్మీకి సినిమాల వివాదం గురించి కూడా తెలిసిందే. తాజాగా సెవెన్ సినిమాని నిర్మించిన నిర్మాత, దర్శకుడు రమేష్ వర్మ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదవ్వడం ఫిలింనగర్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన రాక్షసుడు సినిమా ఇటీవలే రిలీజై మంచి సక్సస్ ను సొంతం చేసుకుంది. అయితే రమేష్ వర్మ నిర్మించిన 'సెవెన్' సినిమా రిలీజ్ టైం లో రకరకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. సెవెన్ సినిమాకి నిర్మాతగా ఉన్న రమేష్ వర్మ తనని మోసం చేశాడంటూ అప్పట్లోనే ఓ ఎన్నారై రమేష్ మీద ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు చేయడం సంచలనమైన సంగతి తెలిసిందే.   

పోలీసులకు ఈ  వ్యవహారం పై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా దర్శకుడు రమేష్ వర్మ ఒక యువతికి అసభ్యకరమైన మెసేజ్ పెట్టారు అంటూ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమీషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇందుకు సంబంధించిన ఓ లేఖను మీడియాకి రిలీజ్ చేశారు. అయితే ఈ లేఖలో రమేష్ వర్మ సెవెన్ చిత్రాన్ని నిర్మించారని.. అప్పట్లోనే ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు ఉన్నాయని ప్రస్థావించారు. సినిమా రిలీజ్ సమయంలో వాణిజ్య ప్రకటనల కోసం తన నుంచి 15 లక్షలు తీసుకున్న రమేష్ వర్మ 4 లక్షలు ఖర్చు చేసినా మిగతా 11 లక్షలు తిరిగి చెల్లించలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నారు. వారంలో ఇస్తానని నాలుగు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని.. ఆ సంస్థ తరపున అమ్మాయికి అసభ్యకర మెసేజ్ ని పంపించారని వెల్లడించారు. 

పోలీస్ కేసు పెడితే ఇన్ ఫ్లూయెన్స్ ఉపయోగించి తప్పించుకున్నాడని ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు. దీని పై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమీషన్ కి ఫిర్యాదు చేస్తే అక్టోబర్ 3 రాత్రి 10.24 నిమిషాలకు ఫిర్యాదు నమోదైందని వెల్లడించారు. చెన్నయ్ లో ఉన్నానని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో నిజా నిజాలేంటన్నది రమేష్ వర్మ మీడియా ముందుకు వచ్చి సమాధానమిస్తే గాని క్లారిటి వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: