కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల సినిమాలు ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుని, తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో మారుమ్రోగేలా చేశాయో తెలిసిందే. ఇక ఆ సినిమాతో దర్శకుడిగా రాజమౌళికి, అలానే అందులోని హీరో ప్రభాస్ సహా మిగతా నటీనటులందరికీ కూడా ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతలు లభించాయి. అయితే అప్పట్లో ఆ సినిమాలు అంత పెద్ద విజయాన్ని అందుకోవడంలో కొంత ముఖ్య పాత్ర పోషిచింది వాటికి చేసిన పబ్లిసిటీ మరియు ప్రమోషన్స్ అనే చెప్పాలి. 

ఆ సినిమాల రిలీజ్ సమయంలో బాహుబలి టీమ్, తమకు అవకాశం ఉన్న ప్రతి ఒక్క మాధ్యమాన్ని తమ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకోవడం జరిగింది. దానితో పాటు ఆ సినిమాలు కూడా ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కడంతో ప్రమోషన్స్ మరింతగా ఉపయోగపడ్డాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో భారీ ఖర్చుతో విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం యావరేజ్ టాక్ ని మాత్రమే సంపాదించి, 

ప్రస్తుతం పర్వాలేదనిపించే కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. అయితే ఈ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోవడానికి ప్రమోషన్స్ మరియు పబ్లిసిటీ సరిగ్గా చేయకపోవడం కూడా కొంత కారణమని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయినప్పటికీ, మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అవడం వంటి సమస్యలు తలెత్తడం, అలానే సైరా టీమ్ పూర్తి స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయలేకపోవడం ఈ సినిమా సక్సెస్ కి కొంత దెబ్బేసినట్లు చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రమోషన్స్, పబ్లిసిటీ వంటి అంశాలు బాహుబలికి ఎంతో మేలు చేస్తే, సైరాకు మాత్రం కొంత నష్టాన్ని చేశాయని అంటున్నారు.....!!
 


మరింత సమాచారం తెలుసుకోండి: