రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ మూవీలో జూనియర్ ఇంట్రడక్షన్ సీన్ పులి ఫైట్ తో ఉండబోతున్న పరిస్థితులలో అదే తరహా ఇంట్రడక్షన్ సీన్ రామ్ చరణ్ ను ఎలివేట్ చేసే విధంగా రాజమౌళి డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘మగధీర’ మూవీలో చరణ్ ఒక ఫైట్ సీన్ లో 100 మంది యోధులను చంపి ఆ మూవీలోని షేర్ ఖాన్ పాత్ర చేత ‘శతధృవంశ యోధుడు’ అని పిలిపించుకున్నట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ వంద మందితో పోరాడి గెలిచిన వీరుడుగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఇంట్రడక్షన్ సీన్ ను రామ్ చరణ్ పై దసరా పండుగ హడావిడి అయిన తరువాత రాజమౌళి చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

‘బాహుబలి’ ఇచ్చిన జోష్ తో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రారంభించినా ఈ మధ్య విడుదలైన ‘సాహో’ ‘సైరా’ ల మూవీల రిజల్ట్ తో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఒక్క చిన్న విషయంలో కూడ ఎటువంటి అశ్రద్ధ ఉండకూడదు అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్. దీనికితోడు ఈ మూవీలో చరణ్ జూనియర్ లు కలిసి నటిస్తున్న నేపధ్యంలో వీరిద్దరి పాత్రల మధ్య బ్యాలెన్స్ చేసి అభిమానులకు ఎటువంటి నిరుత్సాహం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడం అటుంచి ఈ మూవీ ఫలితంలో తేడాలు వస్తే అది రాజమౌళి ఇమేజ్ కి మచ్చగా మారుతుంది కాబట్టి ఈ మూవీ చిత్రీకరణ అనుకున్న సమయానికి హడావిడిగా పూర్తి చేసే ఉద్దేశ్యం రాజమౌళికి లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది దసరాకు మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: