బాలీవుడ్ సూపర్  స్టార్ హృతిక్ రోషన్ మరియు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన  "వార్"  సినిమా అక్టోబర్ 2 న విడుదలైన విషయం తెలిసిందే.  ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిచింది. వార్ సినిమాకు సిద్దార్థ ఆనంద్  దర్శకత్వం వహించాడు.అందాల తార వాణీ కపూర్ హీరోయిన్ గా నటించింది.వార్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

వార్  సినిమాకి విడుదలైన అన్ని చోట్ల నుండి మంచి స్పందన వస్తుంది.బాలీవుడ్ క్రిటిక్స్ నుండి వార్  మంచి రివ్యూస్ రాబట్టుకుంది.ఈ సినిమా లో టైగర్ ష్రాఫ్ మరియు హృతిక్ రోషన్ లు చేసిన  యాక్షన్ సీక్వెన్స్  లు మరియు డ్యాన్స్  లను  ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  ముఖ్యంగా   పోర్చుగల్ దేశం లోని పోర్టో  బ్రిడ్జి పై  షూట్ చేసిన  హైస్పీడ్ అండ్ ఇంటెన్స్  ఛేజ్ సీక్వెన్స్   సినిమాకే హైలెట్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ గురుశిష్యులు గా నటించారు.

వార్ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో  చేరింది. మొదటి రోజు హిందీ వర్షన్ 51.60 కోట్లు,రెండవ రోజు 23.10 కోట్లు , మూడవ రోజు 21.30 కోట్లు మొత్తం 96 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు మరియు తమిళ్ వర్షన్ లు రెండు కలిసి మూడు రోజుల్లో  4.15  కోట్లు కలెక్ట్ చేయడంతో  మొత్తం 100 కోట్ల మార్క ను ఈజీ గా దాటింది. శనివారం  25 కోట్లు కలెక్ట్  చేసింది. నాలుగు రోజుల్లో 125 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్ల వైపు పరిగెడుతుంది .వార్ సినిమాకు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దసరా సెలవులు సినిమాకు బాగా కలిసి వచ్చాయి. వార్ సినిమా లాంగ్ రన్ లో  దాదాపు 300 కోట్ల వరకు సాధిస్తుందని ట్రేడ్  అంచనా వేస్తున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: