మంచు లక్ష్మి హోస్టింగ్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్' కార్యక్రమం పలువురు స్టార్ సెలిబ్రిటీల గుట్టును బయట పెడుతూ బుల్లి తెర కార్యక్రమాలలో మంచి రేటింగ్స్ తీసుకు వస్తోంది. సెలెబ్రెటీల పడక గది రహస్యాలని మంచు వారమ్మాయి ఏమాత్రం మొహమాటం లేకుండా తన ప్రశ్నల ద్వారా కూపీ లాగేస్తూ ఈ కార్యక్రమం పై ఆసక్తిని పెంచుతోంది.  

ఇప్పటికే సమంత వరుణ్ తేజ్ లాంటి స్టార్ల లోగుట్టును బయటకు లాగి బుల్లితెర ప్రేక్షకులకు తెలిసేలా మంచు లక్ష్మి తన ప్రశ్నల ద్వారా గట్టి ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ రహస్యాల్ని కూడా మంచు లక్ష్మి తన కార్యక్రమం ద్వారా బయట పెట్టడానికి తన  వంతు ప్రయత్నాలు చేసింది. 

ఈ షోలో పాల్గొన్న రకుల్ ప్రీత్ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ మధ్యలో ఒక టాప్ హీరో లోగుట్టును బయటపెట్టేసి పెద్ద షాకిచ్చింది. ఈ మధ్య రకుల్ ఒక సినిమాకు సంబంధించి షూటింగ్ లో ఆన్ లొకేషన్ లో ఒక పాటలో హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అతగాడి నుంచి వచ్చే చెమట కంపు తట్టుకోలేక పోయానని రకుల్ బయటకు చెప్పేసింది. 

ఆ సమయంలో ఏంచేయాలో కూడా అర్థం కాలేదని అప్పటికే ఆ సంగతిని హీరోకి చెప్పలేక చివరికి తనే దూరంగా వెళ్లి పెర్ఫ్యూమ్ కొట్టుకుని మ్యానేజ్ చేసేశానని తెలిపింది. అయితే ఇన్ని విషయాలు చెప్పిన ఆ హీరో పేరు మాత్రం రకుల్ చెప్పలేక పోయింది. దీనితో మంచులక్ష్మి ఆ హీరో పేరు ఏమిటి అంటూ అడిగితే ‘ఇందాక నీకు ఆ పేరు చెప్పాను కదా’ అంటూ మంచు లక్ష్మీని కార్నెర్ చేయడానికి ప్రయత్నించింది. దీనితో ఈ  షోను చూస్తున్న చాలమంది బుల్లితెర ప్రేక్షకులు రకుల్ తెలివితేటలకు షాక్ అయ్యారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: