సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నయనతార.  మొదటి సినిమాలో చాలా సాంప్రదాయంగా కనిపించిన నయనతార తర్వాత హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మనసు దోచింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకుంది.  అప్పట్లో స్టార్ హీరోల తో నయనతార కెమిస్ట్రి చాలా చక్కగా కలిసిపోయేది.  ఇక బాలకృష్ణ తో నయనతార పలు సినిమాల్లో నటించింది. 

పదేళ్లకు పైగా హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. దక్షిణాది నటీమణుల్లో ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కెరీర్ కొత్తలో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది.తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు.

పెళ్ళి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది నయన్. కానీ 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా'లో హీరోయిన్ గా నయనతార నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ సందర్భంగా నయన్ ఎక్కడా కనిపించలేదు..తమన్నా మాత్రమే కనిపించింది.  దాంతో ఆమెపై విమర్శలు రావడంతో..  అందుకు కారణాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయిందట నయన్. 

తాను ఏదైనా సినిమా ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నా, ప్రమోషన్స్ కు వచ్చినా, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని, ఆ సెంటిమెంట్ తోనే తాను బయటకు రావడం లేదని చెప్పిందట. నయనతారకు ఇంత సెంటిమెంట్ ఉంటుందా అని ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న నయన్, పెళ్లి విషయంలో మాత్రం నోరెత్తడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: