ముంబైలో ఇటీవల జరిగిన ఎల్లీ బ్యూటీ అవార్డ్స్ 2019 ఈవెంట్ ఘనంగా  జరిగింది.  సాధారణమైన ఫంక్షన్ అంటేనే డిజైనర్ డ్రెస్సులలో హాజరై అందాల భామలు 'బ్యూటీ అవార్డ్స్' అంటే ఊరుకుంటారా? సూపర్ హాట్ గా ఉండే డ్రెస్సులు ధరించి ఎల్లి అవార్డుల ఈవెంటుకు తరలి వచ్చారు భామలు. ఈ ఈవెంటుకు చాలామందే హాజరయ్యారు కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం కరీనా కపూర్ ఖాన్.. జాన్వి కపూర్.. అనుష్క శర్మపైనే ఉందని ముంబై మీడియాలో ఒక పెద్ద హాట్ టాక్.  


కరీనా స్టైల్ గురించి తెలిసిందే కదా.. మొదటి నుంచే ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ కరీనా. ఇండియాలో  జీరో సైజ్ ను మొదలు పెట్టి సంచలనం సృష్టించిన భామ కరీనా.  వివాహమై బాబు పుట్టిన తర్వాత కూడా ఫ్యాషన్ విషయంలో తన సత్తా చాటుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. 

ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు  రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ టాప్..  పింక్ కలర్ థై స్లిట్ స్కర్ట్  ధరించి అందరి ఆకర్శించింది. గౌనుకు పాకెట్స్ ఉండడంతో స్టైల్ గా పాకెట్స్ లో చేతులు పెట్టుకుని అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది కరీనా.  ఇక జాన్వి విషయానికి వస్తే ఈ జెనరేషన్ బ్యూటీ కాబట్టి సీనియర్లకు గట్టిపోటీ ఇచ్చేలాగా  మెటాలిక్ బ్రౌన్ కలర్ గౌన్ ధరించి జనాలను దడదడలాడించింది ఈవెంట్లో  డీప్ యూ-నెక్(దాన్ని వీ నెక్ అంటే మనకు ఇంగ్లీష్ రాదని అనుకునే ప్రమాదం ఉంది).. థై స్లిట్ తో హాట్ నెస్ ను ఒలికించింది.   

ఇక అనుష్క శర్మ వైట్ కలర్ షిఫాన్  గౌన్ లో దుమ్ములేపింది అంటే నమ్మండి. కొంతభాగం గౌన్ పారదర్శకంగా ఉండడం కారణం వలన.. థై స్లిట్ కూడా ఉండడంతో అనుష్క కూడా ఎల్లి అవార్డ్స్ ఫ ఫంక్షన్లో ఏసీ పాయింట్లు పెంచాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ ముగ్గురే కాదు..ఇంకా ఇతర బ్యూటీలు కూడా హాటు డ్రెస్సుల్లో హాజరై బ్యూటీ అవార్డులకు ఈవెంటుకు అసలు న్యాయం చేశారు .



మరింత సమాచారం తెలుసుకోండి: