మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా మూవీ ధియేటర్లలో సందడి చేస్తోంది. దసరా, వీకెండ్ సెలవులు ఈ సినిమాకు కలిసొస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ బాగానే ఉన్నా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది మరొకొన్ని రోజుల తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికి వస్తున్న కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70కోట్ల షేర్ ను సాధించి మరిన్ని కలెక్షన్లు సాధించింది. యూఎస్ మార్కెట్లో సైరా మంచి వసూళ్లనే రాబడుతోంది.

 


యూస్ లో ఆదివారం మధ్యాహ్నానికి 2 మిలియన్ మార్క్ కలెక్షన్లు దాటింది. ఇంకా సినిమాకు రన్ ఉండటంతో మంచి ఫిగర్స్ వస్తాయని అంటున్నారు. నిజానికి 2 మిలియన్ మార్క్ దాటటమంటే ఏ హీరో సినిమాకైనా అచీవ్ మెంటే. సీనియర్ నటులతోపాటు, ఈ జనరేషన్ హీరోలు కూడా 1మిలియన్ మార్క్ వస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయనే అనుకుంటారు. సూపర్ హిట్ అయితేనే 2మిలియన్ మార్క్ దాటుతూంటాయి. అలాంటిది మెగాస్టార్ నటించిన ఖైదీ నెం.150 మూవీ 2.4 మిలియన్లు వసూలు చేసింది. కమ్ బ్యాక్ తర్వాత చేసిన రెండో సినిమా సైరా కూడా 2మిలియన్ మార్క్ చేరుకోవడం చిరంజీవి మార్కెట్ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే సినిమాకు వచ్చిన హిట్ టాక్ కు కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది. ఏ సీనియర్ హీరో సినిమా కూడా యూఎస్ లో చిరంజీవి సినిమా స్థాయి కలెక్షన్లు రావటం లేదు. నిర్మాతలకు యూఎస్ మార్కెట్ ఎంతో ముఖ్యంగా మారింది.

 


పవన్, మహేశ్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్.. వంటి హీరోలకు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. యూఎస్ లో బాహుబలి తర్వాత స్థానం రంగస్థలం మాత్రమే 3.5 మిలియన్ మార్క్ చేరుకుని టాప్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: