తాజాగా ముంబాయిలో జరిగిన ఎల్ బ్యూటీ అవార్డుల వేడుకకు చాలా మంది సినీ తారలు ఆ వేడుకకు హాజరయ్యారు. అందాల దేవకన్యలు అందరు ఒక చోట ఉంటె ఎలా ఉంటుందో ఆ స్టేజి కూడా అలా బాలీవుడ్ తారాల అందాలతో అలా వెలిగిపోయింది. ఎందరో బ్యూటీస్ అందరు ఇక్కడ సందడి చేసారు. అందాలను ఆరబోస్తూ ఒక్కో హీరోయిన్ ఒక్కో రేంజులో అదిరిపోయే డ్రెస్సులో అక్కడకు విచ్చేసి ఫ్యాన్స్ కి కన్నుల పండుగ చేశారు. 


ఇకపోతే బాలీవుడ్ బ్యూటీస్ గతంలో ఒకరితో  రిలేషన్ లో ఉండి మరొకరితో పెళ్లి చేసుకుంటారు. అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, రణవీర్ ప్రేమలో ఉండి  విడిపోయి వేరే వాళ్ళను పెళ్లిచేసుకున్నారు. ఐతే రణవీర్ ఆమెతో ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉన్నారు. ఇకపోతే రణవీర్ ఏ షో కి వెళ్లిన కూడా దూకుడుగా వ్యవహరిస్తాడన్న విషయం తెలిసిందే.. 



ఈ అవార్డు వేడుకకు కూడా కాస్త ఎక్కువగానే చేసాడు. హోస్ట్ దగ్గర ఉన్న మైక్ ను తీసుకొని సక్సెస్ అంటే పూర్తి నిర్వచనం మనకు అనుష్క చెబుతుంది అని వెల్లడించగా... ఎందుకో కోపంగా ఉన్న ఈ అమ్మడు రణవీర్ గారు మీకు తెలియని ఒక విషయం చెప్పనా మీరు నాకు తెలిసి ఈవెంట్ కు వచ్చిన ఒక సెలెబ్రెటీ అంతేగాని హోస్ట్ కాదు అని వ్యంగ్యంగా అంది. 



దానితో చిన్న మొహం చేసుకున్న రణవీర్ ఓ సారి సారి అంటూ ఎక్కడి నుండి మైక్ తీసుకున్నాడో అక్కడ పెట్టేసి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఎల్ అవార్డ్స్ షోలో రణ్‌వీర్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని అందుకున్నారు. అనుష్కకు ఎల్ ఇంపాక్ట్ ట్రోఫీ దక్కింది. బాలీవుడ్ నటులు కరీనా కపూర్, జాన్వి కపూర్, తారా సుతారియా, అనన్య పాండే, మానుషీ చిల్లార్ తదితరులు ఈ అవార్డ్స్‌ షోలో పాల్గొని సందడి చేశారు. ఎల్ బ్రాండ్‌కు అనుష్క ఎప్పటినుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఆ షో మొత్తం అందాలతో విరాజిల్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: