టాలీవుడ్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య కెరీర్ 105వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. గతంలో బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ ల కాంబినేషన్లో వచ్చిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా మంచి పవర్ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల కొద్దిరోజుల క్రితం బ్యాంకాక్ నుండి నేరుగా హైదరాబాద్ విమానాశయం చేరుకున్న బాలయ్యను చూసి, కొంత ఆశ్చర్యపోయిన కొందరు అభిమానులు ఆయనతో కలిసి దిగిన ఫొటోతో తొలిసారి ఈ సినిమాలో బాలయ్య లుక్ బయటకు రావడం జరిగింది. మోడరన్ హెయిర్ స్టైల్, ఫ్రెంచ్ గడ్డంతో సూట్ వేసుకున్న బాలయ్య, ఆ లుక్ లో ఓవర్ ఆల్ గా అదరగొట్టారు. అయితే ప్రస్తుతం దసరా పండుగను పురస్కరించుకుని ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని, 

అధికారికంగా కాసేపటి క్రితం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ లుక్ లో బాలయ్య సూటు, బూటు వేసుకుని ఒంటినిండా పసుపు కుంకుమతో, ఉగ్రరూపంలో నెత్తురోడుతున్న కత్తిని పట్టుకుని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఇంతవరకు టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: