టాలీవుడ్ లో ఎన్నో విలన్ పాత్రలు పోషించి..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు చలపతిరావు.  ఒకప్పుడు చలపతిరావు బయటకు వస్తే కొంతమంది ఆడవాళ్లు భయపడి పక్కకు జరిగేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చలపతి రావు. అప్పట్లో రౌద్రంగా కనిపిస్తూ..రేప్ సీన్లలో ఎక్కువగా కనిపించేవారు చలపతిరావు.  గత కొంత కాలంగా ఆయన తండ్రి, తాతయ్య పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ లో నటీనటుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో చలపతిరావు తనయుడు రవిబాబు దర్శకుడిగా అడుగు పెట్టాడు. 

ఆయన తొలిసినిమా ‘అల్లరి’.  మొదటి సినిమాతో నిజంగానే అల్లరి చేసి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు. కామెడీ లో కొత్త కాన్సెప్ట్ తో మంచి విజయం అందుకున్నాడు.  తర్వాత రవిబాబు నటుడిగా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలు పోషించారు.  టాలీవుడ్ లో నటుడుగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా రవిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`.  ఈ మూవీలో ఆమ‌న‌తో పాటు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణం కాగా హిట్ మూవీ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిస్తోంది.

కాగా  ఈ మూవీ అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆదివారం ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ప్ర‌క‌టించారు. కాగా `అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు సినిమాలు చిత్ర జ‌య ప‌రాజ‌యాలు ఎలా ఉన్నా ద‌ర్శ‌కుడుగా ర‌విబాబు త‌న‌దైన ట్రేడ్ మార్కును ఏర్పాటు చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: