బాహుబలి తో అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసారు రాజమౌళి. తెలుగు సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన చిత్రం అది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి ద బిగినింగ్ చిత్రం జపాన్, చైనా వంటి దేశాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమైంది. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లు వేశారు. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానాలు ఆల్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు.

తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్నీ వెల్లడిస్తూ తాజాగా రాజమౌళి ట్వీట్ చేసాడు.  ఐతే.. ఈసినిమాను లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా బాహుబలి ..ది బిగినింగ్’ రికార్డులకు ఎక్కింది.  ఈ విషయమై చాలా సంతోషంగా ఉందంటూ రాజమౌళి కాస్తంత ఎమెషనల్ ట్వీట్ చేసాడు.
ఈ నెల 19న అక్కడ ‘బాహుబలి.. ది బిగినింగ్’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు బాహుబలి టీమ్  ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, యం.యం. కీరవాణి, చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


 ‘బాహుబలి’ తో పాటు అక్కడ ‘స్కైఫాల్’,‘హ్యరీ పోటర్’ వంటి చిత్రాలను ప్రదర్శించనున్నారు.  రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వారు బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో సత్తా చాటిన వారికి గౌరవ సూచకంగా రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా మారింది.  ఎంటర్‌టైన్మెంట్ రంగంలో భాగంగా ఈ హాల్‌లో బాహుబలి  బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కచేరీ జరగనుంది. 


కార్యక్రమం అనంతరం బాహుబలి టీం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొననుంది. అంతేకాదు  అక్కడ కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల సినిమాలను ఇక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ లో పెర్ఫామ్ చేయనుండడం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: