ఇక టాలీవుడ్ లో  రకరకాల వివాదాలు.. కోర్టు కేసులు ఎక్కువయ్యి. ఇటీవలే సైరా .. వాల్మీకి చిత్రాల వివాదం గురించి అందరికి తెలిసిందే కదా. తాజాగా సెవెన్ చిత్ర నిర్మాత రమేష్ వర్మ పై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు కావడం ఫిలింనగర్ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన రాక్షసుడు సినిమా  ఇటీవలే రిలీజై విజయం సాదించింది. అయితే ఆయన నిర్మించిన 'సెవెన్' చిత్రం రిలీజ్ సమయంలో రకరకాల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. సెవెన్ చిత్రానికి నిర్మాతగా ఉన్న రమేష్ వర్మ తనని మోసం చేశాడు అంటూ అప్పట్లోనే ఓ ఎన్నారై అతడిపై ఫిలింఛాంబర్ కి ఫిర్యాదు చేయడం ఒక పెద్ద సంచలనం లేపింది.


పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా  చేశారు. తాజాగా దర్శకుడు రమేష్ వర్మ ఓ యువతికి అసభ్యకరమైన మెసేజ్ చేశారు అంటూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమీషన్ లో ఫిర్యాదు నమోదు అయంది అంటూ ఓ లేఖను మీడియాకి రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ లేఖలో రమేష్ వర్మ సెవెన్ చిత్రాన్ని నిర్మించారని.. అప్పట్లోనే ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు ఉన్నాయని కూడా తెలియచేసారు. 


సినిమా రిలీజ్ సమయంలో వాణిజ్య ప్రకటనల కోసం తననుంచి 15 లక్షలు తీసుకున్న రమేష్ వర్మ 4 లక్షలు ఖర్చు చేసినా మిగతా 11 లక్షలు తిరిగి ఇవ్వలేదని సదరు వ్యక్తి ఆరోపణ చేశారు. వారంలో ఇస్తానని నాలుగు నెలలుగా తప్పించు కుంటున్నాడు.. ఆ సంస్థ తరపున అమ్మాయికి అసభ్యకర మెసేజ్ ని పంపించారని తెలిపారు. పోలీస్ కేసు పెడితే ఇన్ ఫ్లూయెన్స్ ఉపయోగించి తప్పించుకున్నాడని ఆరోపిస్తూ లేఖలో తెలిపారు.


దీని పై తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమీషన్ కి ఫిర్యాదు చేస్తే అక్టోబర్ 3 రాత్రి 10.24 నిమిషాలకు ఫిర్యాదు నమోదు అయ్యినట్లు తెలిపారు. చెన్నయ్ లో ఉన్నానని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈ లేఖలో తెలిపారు.కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం  అన్నది రమేష్ వర్మ మీడియాకు తెలియ చేయాలిసి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: