టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. కథ  బాగుంటే  మల్టీస్టారర్ చేయడానికి 

ముందుకు వస్తున్నారు హీరోలు. ఇక ఒక ఫ్యామిలీకి చెందిన వారైతే ఎప్పుడెప్పుడు మల్టీస్టారర్ కథ తమ దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే టాలీవుడ్లో చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు  చేశారు. కొంత మంది  ఫ్యామిలీ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తే... కొంతమంది ఫ్యామిలీ హీరోలు కానీ వాళ్లు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసారు. ఇప్పటికే ఓకే ఫ్యామిలీకి చెందిన హీరోలు  చాలా సినిమాల్లో కలిసి నటించారు. 

 

 

 

 

 మనం సినిమాలో నాగేశ్వరావు నాగార్జున నాగచైతన్య అఖిల్ కలిసి నటించగా .. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కలిసి నటించారు. ఇక ఇప్పుడు వెంకటేష్ నాగచైతన్య కలిసి వెంకీ సినిమాలో నటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో కలిసి నటించారు. ఇక చిరంజీవి రామ్ చరణ్ అయితే రెండు మూడు సినిమాల్లో  నటించి స్క్రీన్  షేర్ చేసుకున్నారు. కాగా  మెగాస్టార్ చిరంజీవి,  రామ్ చరణ్ మరోసారి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ రోల్స్ లో ఎంట్రీ ఇచ్చి అలరించారు. ఇప్పుడు మాత్రం దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కోసం ఓ మంచి కథను రెడీ చేసాడట. 

 

 

 

 

 అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  లో రామ్ చరణ్  నటిస్తుడటంతో   ఆ సినిమా పూర్తి అయ్యేంత వరకు  జక్కన్న రామ్ చరణ్ ని  వదిలే ప్రసక్తే ఉండదు కాబట్టి ఆ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ సినిమా పట్టలేకతుందట . ఇక ఈ సినిమాలో చిరంజీవి హాకీ కోచ్ గా నటిస్తుండగా... ఓ పవర్ఫుల్ రోల్లో  రామ్ చరణ్ నటించబోతున్నాడు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే స్క్రీన్ పై  కనిపిస్తే ఇక మెగా అభిమానులకు కావాల్సిందేముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: