మెగా బ్రదర్ టవర్ స్టార్ నాగబాబు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. జబర్దస్త్ అంటే బాబు గారి నవ్వు ఉండాల్సిందే. అంతగా ఫెమస్ అయ్యాడు. ఎప్పుడో సినిమాలకి ఎప్పుడో దూరంగా ఉన్నారన్న విషయం తెలిసిందే..అప్పుడప్పుడు ఎదో సినిమాలో అలా మెరిసే బాబు ఈ సారి కాస్త యవ్వనంగా కనిపించేలా న్యూ లుక్ తో అదరకొడుతున్నాడు. 


ఇకపోతే నాగబాబు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలా ఎన్నో సినిమాలు తెరకెక్కించి మంచి పేరును తెచ్చుకున్నాడు. బుల్లితెర లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పే కామెంట్లు ఆయన వేసే కుళ్లు జోకులు అందరిని ఆకట్టుకున్నాయి. అందుకే ఆ షో ఓ రేంజులో హిట్ అయింది. 



ఇకపోతే బాబుగారు వరుణ్ బాబు ను మించిన విదంగా యంగ్ లుక్ లో డ్రెస్ కళ్ళజోడు పెట్టి అదిరిపోయేలా.. ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసాడు ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. తనకు ఏదైనా చేయలనిపిస్తే అన్న గారిని స్ఫూర్తిగా తీసుకుంటానని వెల్లడించారు. 


ఈ మధ్య కాలం తమ్ముడు పవన్ తో ఎక్కువగా కనిపిస్తున్న మెగా బాబు ఈ కొత్త లుక్ ఎందుకోసం చేసాడు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇది ఏమైనా కానీ నబాబు కొత్త లుక్ మాత్రం అదిరిపోయిందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు . ఇది ఇలా ఉండగా మరి కొందరు మాత్రం నాగబాబు మళ్ళీ సినిమాలలో హీరో ఫ్రెండ్ గా చేయాలని అనుకుంటున్నారేమో అని కితాబిస్తున్నారు. మరి బాబుగారి అసలు లుక్ వెనక రహస్య తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. అయితే బాబు గారు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని సమాచారం అందుకోసమే ఈ న్యూ లుక్ అట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: