మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమర యోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు తన నట విశ్వరూపాన్ని సినీ లోకాన్ని అబ్బురపరిచాడు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ.. కలెక్షన్లలో దుమ్ములేపుతోంది.

నాల్గో సైరా జోరు..


మొదటి రోజే 85కోట్లు కొల్లగొట్టిన సైరా.. మూడు రోజుల్లోనే వందకోట్లకు చేరుకుంది. ఇక వీకెండ్లో ఎక్కడ చూసిన సైరా హవానే కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఇక ఇదే విదంగా కొనసాగితే.. రికార్డులన్నీ సైరా ఖాతాలోనేనని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


సినిమాపై శరత్ కుమార్ కామెంట్స్...


తమిళ నటుడైన శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బన్నీ సినిమాలో పవర్ ఫుల్ రోల్ వేయగా, ఆ మధ్య జయ జానకీ నాయక, నా పేరు సూర్య సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. శరత్ కుమార్, చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. సైరా సినిమాను వీక్షించిన శరత్ కుమార్.. తన అభిప్రాయాన్నిసోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. స్వతంత్ర్యం కోసం చేసే యుద్దం, వారు చేసిన త్యాగాలను చక్కగా చూపించారు. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.


రాధిక కామెంట్స్..


చిరంజీవి, రాధికా అంటే ఎన్నో మరుపురాని హిట్ చిత్రాలు, హుషారెత్తించే పాటలు తెలుగు ప్రేక్షకులకు గుర్తొస్తాయి . చిరుకు రాధికా మంచి స్నేహితురాలనే విషయం అందరికీ తెలిసిందే. సైరాను చూసిన రాధికా..,చిరుపై ప్రశంసలు కురిపించింది. తనను తాను ఈ చిత్రంతో అధిగమించేశాడంటూ కీర్తించింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని తెలిపింది. మన చరిత్రను, ఎమోషన్స్ ను చక్కగా మలిచారు. బ్లాక్ బస్టర్ అయినందుకు నిర్మాత చరణ్ కు కంగ్రాట్స్ ను తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: