సినిమా ఎక్కడైనా ఒకటే. కాకపోతే భాష మారుతుంది.. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరుగా ఉంటుంది. తెలుగు, తమిళ సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో క్రేజ్ ఎక్కువ. కంటెంట్, స్క్రీన్ ప్లే, టేకింగ్.. అన్నీ వేరేగా ఉంటాయి. అందుకే అక్కడి డైరెక్టర్లు ఇక్కడ, ఇక్కడి డైరెక్టర్లు అక్కడ రాణించలేరు. కానీ తమిళ్ కంటే తెలుగులోనే కొద్దిగా తమిళ డైరెక్టర్ల హవా ఎక్కువగా ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళలో తిరు  కూడా ఉన్నాడు. గోపిచంద్ హీరోగా వచ్చిన చాణక్య సినిమాకు దర్శకుడు.

 

 

 

సినిమాలో కథ కంటే కథనానికే ప్రాముఖ్యత ఇచ్చిన ఈ సినిమాలో తమిళ వాసన కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు తమిళ దర్శకులను తట్టుకుంటారేమో కానీ సినిమాలో తమిళ కంటెంట్ ఉంటే ఒప్పుకోలేరు. ఈ సినిమాలో అలీ, హీరోయిన్, హీరో,ఓ కుక్కతో పెట్టిన కామెడీ మనవాళ్ళు తట్టుకోలేకపోతున్నారట. నిజానికి తమిళ కామెడీలో కాస్త అతి ఎక్కువగా ఉంటుంది. మనవాళ్ళు కంటెంట్ బేస్డ్, స్పెషల్ కామెడీ ట్రాక్, డీసెంట్ కామెడీని ఇష్టపడతారు. కానీ ఇక్కడ తిరు తెలుగు ప్రేక్షకుల దృష్టి కోణంలో కాకుండా తన నేటివిటీ కామెడీనే పెట్టేసాడు. ఇది కొంత ఏవగింపుగా ఉందని అంటున్నారు. 

 

 

 

1999లో వచ్చిన చిరంజీవి సినిమా స్నేహం ఇందుకో ఉదాహరణ. ఈ సినిమా ఆధ్యంతం తమిళ నేటివిటీతోనే ఉంటుంది. దర్శకుడు కెఎస్ రవికుమార్ తెలుగు సినిమా అనే స్పృహ లేకుండా తీసాడు. చిరంజీవి తమిళ సినిమా చేసాడా అనే విమర్శలు కూడా వచ్చాయి. ఓ దర్శకుడు మరో భాషలో దర్శకత్వం వహించడం మామూలే గానీ ఆ భాషలో తీస్తున్నప్పుడు అక్కడి ప్రేక్షకుల అభిరుచికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తమిళ్ సినిమాలో నేటివిటీ బేస్ ఎక్కువగా ఉంటే, తెలుగు సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: