సూపర్  స్టార్  మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్నా సినిమా సరిలేరు నీకెవ్వరు.  దిల్  రాజు,  అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా లో రష్మిక మందన్న  హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ  లుక్ ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 

 

ఇప్పటికే ఈ మూవీలో మహేష్ ఆర్మీ  ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఇప్పటికే సినిమా నుండి రిలీజ్  అయిన టైటిల్ సాంగ్ సూపర్ హిట్ అవగా.. ఇప్పుడు సినిమా నుండి రిలీజ్ అయిన మరో లుక్ దసరా కానుకగా రిలీజ్ చేశారు.  

 

కొండారెడ్డి బురుజు ముందు చేతిలో గొడ్డలి పట్టుకుని తన వాళ్ళని కాపాడడానికి నిలుచున్నట్టు కనిపిస్తున్నాడు. నిజంగా ఈ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  కొన్నాళ్లుగా మహేష్ కేవలం క్లాస్ సినిమాలే చేస్తున్నాడు అన్న కామెంట్స్ కు సరైన సమాధానంగా ఈ మూవీ వస్తుందని చెప్పొచ్చు.  

 

2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తుంది. మీరు మహేష్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తా అని చెబుతున్న అనీల్ చెప్పినట్టుగానే సూపర్ స్టార్ తో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: