మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలువురు ఇతర భాషలకు చెందిన అగ్రనటులు ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫి ని అందించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబడుతూ ముందుకు సాగుతోంది. 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలను అద్భుత విజయాలుగా మలచిన కొరటాల, ఈ సినిమాలో మెగాస్టార్ ని ఒక పవర్ఫుల్ రోల్ లో చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమాలోని క్యారెక్టర్ కోసం చిరంజీవి చాలా వరకు వెయిట్ కూడా ఇటీవల తగ్గడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు రేపు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

దసరా పండుగను పురస్కరించుకుని సినిమా యూనిట్ రేపు అధికారిక పూజను నిర్వహించాలని నిర్ణయించారట. అయితే ముందే ఈ విషయాన్ని బయటకు రివీల్ చేస్తే, భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి మెగా ఫ్యాన్స్ చేరుకునే అవకాశం ఉండడంతో దానిని గోప్యంగా ఉంచినట్లు చెప్తున్నారు. ఇక రేపు ఉదయం ఎంతో ఘనంగా ప్రారంభం కానున్న ఈ వేడుకకు పలువురు సినిమా రంగ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడికానున్నట్లు తెలుస్తోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: