నటసింహా నందమూరి బాలకృష్ణ - కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ బీకే 105 గా ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకోబోతోంది. హ్యాపీ మూవీస్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయాల్సిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి గ్యాంగ్ స్టర్ గా మారడానికి కారణమేంటి? అన్నది తెరపై చూపిస్తున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ఇంతకముందు బాలకృష్ణ - కే.యస్.రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన జై సింహ కమర్షియల్ గా సక్సస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే మళ్ళీ ఇదే కాంబోలో సినిమా వస్తుందనగానే అంచనాలు బాగానే నెలకొన్నాయి.

ఇక బాలయ్య సూటు బూటులో క్లాస్ గా ఉన్న పోస్టర్లను రీసెంట్ గా లాంచ్ చేశారు. ఫ్రెంచి గడ్డంతో బాలయ్య లుక్ కొత్తగా ఉండటంతో యంగ్ హీరోలా మారిపోయారని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక తాజాగా దసరా కానుకగా ఎన్ బీకే 105 కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య ను చూస్తుంటే మరో సారి సింహా, లెజెండ్ తరహాలో 105 లో పాత్ర ఉండబోతోందని అర్థమవుతుంది. అంతేకాదు కె.ఎస్.రవికుమార్ గత యాక్షన్ చిత్రాల మాదిరినే ఈ సినిమాని మాస్ అంశాలతో తెరకెక్కిస్తున్నారని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది.

ఇక బాలయ్య మేకోవర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటోంది. గౌతమిపుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ సినిమాల్లో వైవిధ్యంగా కనిపించిన బాలయ్యను ఈసారి కూడా అంతే కొత్తగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. అయితే పోస్టర్ తో పాటే టైటిల్ ని ప్రకటిస్తారని ఎదురు చూసిన అభిమానులకు మాత్రం కాస్త నిరాశే మిగిలిందని టాక్. ఈ సినిమాకు రూలర్.. క్రాంతి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య సరసన సోనాల్ చౌహాన్..  వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా మరో సీనియర్ నటి భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: