టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో యావరేజ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇకపోతే అంతకముందు వచ్చిన టాక్సీ వాలా సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్, మధ్యలో వచ్చిన నోటాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఒక సినిమా అలానే, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో హీరోగా నటిస్తున్న విజయ్, అతి త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించబోయే సినిమాలో యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నట్లు సమాచారం. 

విజయ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక పక్కా మాస్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ తన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నటి ఛార్మి కూడా ఈ సినిమా నిర్మాణంలో ఒక భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన ఇటీవల తన ఓరకంటి కనుసైగతో యావత్ కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పేరు వైరల్ అవ్వగా, అటువంటిది ఏమి లేదని ఆమె తండ్రి బోనీ కపూర్ తేల్చిన విషయం తెలిసిందే. 

అయితే ప్రియా ప్రకాష్ వారియర్ ను మరొక రెండు రోజుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి, కథను వినిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కు కూడా మంచి స్కోప్ ఉందని, ఆ పాత్రను ప్రియా అయితే పోషించగలదని దర్శకుడు పూరి భావించి ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: