కొన్ని సంవత్సరాల క్రితం వరకు మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు రూపొందించడానికి ప్రొడ్యూసర్స్ క్యూలు కట్టేవారు. వాళ్లతో సినిమాలు చేస్తే లాభాలు లెక్కకు మించి వస్తాయని వాళ్ళ డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇంకా చెప్పాలంటే పడిగాపులు కాచేవారు. ఈ నలుగురు హీరోలు కూడా ఇండస్ట్రీకి ఒకరిని మించి ఒకరు భారీ హిట్స్ ఇచ్చినవాళ్ళేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి హీరో ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు స్టార్స్ గా ఎదిగేసరికి ఈ నలుగురు సీనియర్ స్టార్స్ రేస్ లో వెనుకపడిపోయారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి కొన్ని సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ లోగా యంగ్ హీరోలందరూ ఇండస్ట్రీని ఆక్రమించారు. అప్పటి నుండి సీనియర్ హీరోలు అప్పుడప్పుడు ఒక హిట్ కొట్టడం తప్ప అంతకన్న ఏం చేయలేకపోతున్నారు.  

అయితే మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో హిట్ కొట్టారు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో.. బాహుబలి ఇన్స్పిరేషన్ తో దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో  'సైరా' సినిమా తీశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత అన్ని భాషల్లోనూ మంచి రివ్యూలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్నంతగా రావట్లేదు. ఇంక హిందీలో అయితే ప్లాప్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మిగతా భాషల్లోను అంతే..!

ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుతున్నారు. ఆరు పాటలు ఆరు ఫైట్లు రోజులు పోయాయి. ఇప్పుడున్న యువ హీరోలు పాత్రకి తగ్గట్టు తమ ఫిజిక్, హెయిర్ స్టైల్ అన్నీ మార్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా చెప్పాలంటే పూరి భారీ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ . అందుకే ప్రేక్షకులు వాళ్ళ సినిమాల మీద చూపించినంత ఆసక్తి సీనియర్ హీరోల సినిమాల మీద చూపించట్లేదు. దీనినిబట్టి చూస్తుంటే మన సీనియర్ హీరోలు తమ మార్కెట్ పరిధి మేరకు సినిమాలు చేసుకోవడం మంచిదని చెప్పక తప్పదు. కోట్లకు కోట్లు పెట్టి ఈ స్టార్ హీరోలు సినిమాలు తీసినా జనాలను థియోటర్స్ కి రప్పించడం చాలా కష్ఠమవుతోంది. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు తమ క్యారక్టర్ మంచిదైతే చిన్న పాత్రలు కూడా చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితిని అర్ధం చేసుకుని ఇప్పటి నుంచైనా ఈ ఎక్స్‌పరిమెంట్స్ చేయడం మానుకుంటే బెటర్. లేదంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: