సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది మొహానికి రంగేసుకొని ఏదో చిన్న వేశం వేస్తే చాలు అనుకొని వస్తారు. కానీ వాళ్ళ అదృష్టం బావుండి ఒక్కోసారి మంచి పాత్రలే దొరకడం కాదు మంచి ప్రొడ్యూసర్స్ దొరికి హీరో అయ్యో ఛాన్స్ కూడా వస్తుంది. అలానే బాహుబలి, బద్రీనాథ్, మిర్చి, జోష్ వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్న రాకేష్ వర్రే హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. 'ఎవ్వరికీ చెప్పొద్దు' అంటు దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు బసవ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గార్గేయి హీరోయిన్‌గా పరిచయం అయింది. 'మీ క్యాస్ట్ ఏమిటి' అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించడంతో పాటు హీరో రాకేష్ సొంత నిర్మాణంలో రూపొందించడం విశేషం.  

ఇక ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయడటంతో ఒక్కసారిగా సినిమా మీద గట్టి హైప్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమా ఫీల్డ్ లోకి నటించడానికి వస్తా అన్నా, హీరోగా చేయడానికి వస్తానన్నా, నిర్మాతగా వస్తానన్నా నేను ముందే వద్దని చెప్పేస్తా. ఎందుకంటే దూరం నుండి చూసేది వేరు. ఫీల్డ్‌లోకి దిగిన తరువాత వేరు. ఉదాహరణకు ఈ స్టేజ్ మీద నేను వినాయక్, బాబీ, తరుణ్ ఇలా చాలా మంది ఉన్నాం. మేం కష్టపడి సక్సెస్ అయ్యాం. కాని కష్టపడి సక్సెస్ కానివాళ్లు చాలా మంది మీలోనే ఉన్నారు. సక్సెస్‌ను చూసి అట్రాక్ట్ అవుతాం కాని.. ఫెయిల్యూర్స్ అనేవి కొత్తగా వచ్చేవాళ్లకు కనిపించదు. ఇదే సినిమా ఫీల్డ్. అంటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో వాస్తవం కూడా ఉంది.

నిజం చెప్పాలంటే.. శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్ లాంటి వాళ్లు ఈ కొత్త వాళ్లను పాడుచేస్తున్నారు. ఒక్కసారిగా వచ్చి అద్భుతమైన సినిమా తీస్తారు.. హిట్ కొడతారు. వీళ్లను చూసి అందరూ రెడీ అవుతారు. వాళ్లు తీశారుగా.. మేమెందుకు తీయకూడదు అంటు రెడీ అయిపోతారు. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ తీయలేదా.. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు తీయలేదా అంటారు. వాళ్లు ఎలాగైతే తీశారో.. ఇప్పుడు 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా కూడా ఈ కొత్త వాళ్లు అలాగే తీశారు... అంటు సరదాగా మాట్లాడారు. ఇక సినిమా ఈ రోజు థియేటర్స్‌ లోకి వచ్చి.. మంచి సినిమా అన్న టాక్ ని తెచ్చుకుంటుంది. సరదాగా సాగిపోయో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: