అందరూ హీరోయిన్లుగా కనిపించాలని కోరుకుంటారు.  అందులో తప్పులేదు.  హీరోయిన్లుగా కన్పించేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు.  ఎవరూ కాదనరు.  అయితే, ఓ హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్ లాగా మారాలి అనుకోవడం పెద్ద తప్పు.  అలా అనుకోని ఆమెలా మారేందుకు ప్రయాణం చేసి శరీరాన్ని దారుణంగా మార్చుకోవడం మరీ పెద్దతప్పు.  ఒరిజినల్ గా ఎలా ఉన్నారో అలా ఉంటూ వారిని ఫేమ్ చేసుకుంటే అంతకన్న మంచి నటులు అనిపించుకోవచ్చు.  


ఇరాన్ దేశానికీ చెందిన సహర్ తబర్ అనే నటి మొదటి నుంచి ఏంజలీనా జోలీ అంటే చాలా అంటే ఇష్టం.  ఆమె సినిమాలు మొత్తం చూసింది.  నటిగా తన ప్రస్థానాన్ని సాగించడం మొదలుపెట్టిన తరువాత మంచి సినిమాలు చేసింది.  సంపాదించింది.  సోషల్ మీడియాలో కూడా బాగానే పాపులర్ అయ్యింది.  అయితే, ఆమె మొదట అనుకున్నట్టుగా ఆమెలో ఉన్న ఆ పట్టుదల మాత్రం తగ్గలేదు.  ఎలాగైనా ఏంజలీనా జోలీలాగా కనిపించాలని అని నిర్ణయం తీసుకుంది.  


అందుకోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది.  ఏంజలీనా జోలీలా కొద్దికొద్దిగా మారుతూ వచ్చింది. వేల డాలర్లు ఖర్చు చేసింది.  పదుల సంఖ్యలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.  చివరకు లుక్ మార్చుకుంది.  ఆమె లుక్ హాలోవీన్ లుక్ గా మారిపోయింది.  ఏంజలీనా జోలి హర్రర్ యానిమేషన్ సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది.  ఆమెను చూసి అందరు భయపడిపోవడం మొదలుపెట్టారు.  బాప్ రే.. ఏంటిది అని షాక్ కావడం మొదలుపెట్టారు.  


తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఒక్కసారిగా పాపులర్ అయ్యాయి.  సహర్ తోమర్ ఇలా మారిపోయింది ఏంటి అని షాక్ అయ్యారు.  ఆ ఫోటోలను చూసిన ప్రభుత్వం ఆమెకు సంబంధించిన ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్స్ ను బ్లాక్ చేసింది.  ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఒక్కటే ఆమె చేతిలో ఉన్నది.  ఇరాన్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది అంటూ ప్రభుత్వం మండిపడుతున్నది.  తన అభిమాన నటిగా మారాలి అనుకోవడం తప్పుకాదని తబర్ వాదిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: