స్టార్లు తగిలించుకోవడం గొప్ప కాదు, అందమైన బిరుదులు పేరుకు ముందు పెట్టుకోవడం కూడా విలువ ఇవ్వదు. మనిషి అంటే ఎలా ఉండాలి అని చెప్పిన వారే అసలైన  గొప్పవారు అవుతారు. భారతీయ సినిమా రంగంలో ఎందరో సూపర్ స్టార్లు ఉన్న్నారు. అలాగే  స్టార్లకు కొదవ లేదు. అందరూ మహా నటులే. అయితే నిజ జీవితంలో మనిషులుగా ఎందరు ఉన్నారు. మానవత్వంతో వ్యవహరించే వారు ఎంతమంది ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. వెండి తెర మీద హీరోయిజం వరకూ ఒకే.


కానీ అసలు జీవితంలో అది ఉందా అని చూసినపుడు కొంతమంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరసలో ఉంటారు. ఆయన తాను ఎన్ని మెట్లు ఎక్కినా మొదటి మెట్టు మరచిపోలేదు. తన జీవితంలో తొలి దశలో సాయం చేసి ఆదుకున్నవారిని ఎపుడూ మరచిపోలేదు. తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన దివంగత దర్శకుడు బాలచందర్ అంటే రజనీకాంత్ కి దైవంతో సమానం. అలాగే తనకు పాత్రలు ఇచ్చిన నిర్మాతలు అంటే కూడా ఆయనకు ఎంతో గౌరవం.


ఇక తనని తొలిసారి హీరోగా చేసిన ఓ నిర్మాత కష్టాల్లో ఉన్నాడని తెలిసి ఆయనకు ఓ ఇల్లు కొనిపెట్టిన ఔదార్యం రజనీకాంత్ ది  ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ సినీ రంగంలో  తాను గురువుగా భావించే ఓ సీనియర్ దర్శక నిర్మాత కలైజ్ఞానంకి కోటి రూపాయలతో ఒక ఇంటికి కొనిచ్చారు రజనీకాంత్. కలైజ్ఞానం అద్దె ఇంటిలో ఉన్నారని తెలుసుకున్న రజనీకాంత్ ఆయనకు ఇల్లు కొనిస్తారని మాట ఇచ్చారు.


ఆ మాట ప్రకారం చెన్నైలోని విగాంబాక్కంలో  కోటి రూపాయలు విలువ చేసే ఓ ఇంటికి కొనుగోలు చేసి మరీ గురువుకు దక్షిణ‌గా రజనీకాంత్ సమర్పించుకున్నారు. రజనీకాంత్ ని సోలోగా  హీరోని చేసి  1978లో భైరవ మూవీని కలైజ్ఞానం అప్పట్లో నిర్మించారు. అప్పుడు రజనీ కాంత్ చిన్న వేషాలు వేసుకునేవారు.


అలాంటి వాడిని హీరోగా చేసి కలైజ్ఞానం ఒక బంగారు బాట వేశారన్న దానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రజనీ సైతం ఈ ఘనమైన పనిని నిర్వహించారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. రజనీ చేసిన ఈ పని ఒక్క తమిళనాడుకే కాదు, భారతీయ సినిమా రంగం మొత్తం గుర్తుంచుకోవాలి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. చేయూత ఇవ్వాలి. అపుడే స్టార్లకు అసలైన గుర్తింపు లభిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: