నేను నీళ్ళు లాంటి వాడిని ఎలాంటి పాత్రలో అయినా ఇమిడి పోతాను’ అంటూ చిరంజీవి తాను ఎలాంటి పాత్రలను అయినా చేయడానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. నిన్న జరిగిన ‘సైరా’ మీడియా మీట్ కార్యక్రమంలో ‘సైరా’ మూవీని చూసి తనను ప్రోత్సహించిన నాగార్జున వెంకటేష్ లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. 

‘సైరా’ మూవీని చూసి నాగార్జున తన ఇంటికి వచ్చి తనను ప్రేమతో కౌగలించు కుంటే ఈ మూవీని చూసి వెంకటేష్ కూడ తన ఇంటికి వచ్చి తనకు ముద్దు పెట్టిన విషయాన్ని తెలియచేసాడు. ‘సైరా’ ను టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ ప్రశంసించిన విషయాలను తెలియచేస్తూ మహేష్ అభిమానంతో ట్విట్ చేయడమే కాకుండా తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినంధించిన విషయాన్ని తెలియచేస్తూ నటుడుగా తనకు ఇంతకన్నా ఏమికావాలి అంటూ ఆనంద పడ్డాడు. 

ఇదే సందర్భంలో ఈ మూవీ తీయడానికి ‘బాహుబలి’ ఓఅక స్ఫూర్తి అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమా కోసం వ్రాసి ఇచ్చిన పాట మరొక స్ఫూర్తి అని అంటూ సిరివెన్నెల పై కూడ ప్రశంసలు కురిపించాడు. ఈ మీడియా మీట్ లో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందో రాదో తనకు తెలియదు అని అంటూ తెలుగు జాతి చరిత్రను ఈనాటి తరానికి తెలియచేయడానికి తాను ఈ సినిమాను తీసాను అన్న క్లారిటీ ఇచ్చాడు. 

జాతీయ అవార్డుల పై స్పందిస్తూ ‘రుద్రవీణ’ సినిమాలో తాను నటించిన పాటకు ఒక్క ఓటు తేడాతో జాతీయ పురస్కారం రాలేదు అన్న విషయం తనకు కొందరు చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న తనకన్నా అదృష్టవంతుడు మరెవ్వరు ఉండరు అంటూ కామెంట్స్ చేసాడు. చారిత్రాత్మిక సినిమాలకు కలక్షన్స్ రావు అన్న అభిప్రాయాన్ని ‘సైరా’ తొలిగించింది అని చెపుతూ ‘సైరా’ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంకేతాలు చిరంజీవి ఇస్తున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: