చిరంజీవి వూపు  ఇపుడు మామూలుగా లేదు. ఆయన సైరా నరసింహారెడ్డి మూవీ చేశారు. ఓ స్వాతంత్ర సమరయోధుడి జీవిత కధతో  మూవీ చేసిన తరువాత చిరంజీవిలో గొప్ప మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అది ఆయా పాత్రల ప్రభావం కూడా అయి ఉంటుంది. దాంతో ఇపుదు చారిత్రాత్మక పాత్రల విషయంలో చిరంజీవి ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నారు. ఆయా పాత్రలు ఏమైనా ఇంకా స్క్రీన్ మీదకు రాకుండా  ఉంటే వాటిని ప్రాణ ప్రతిష్ట చేసేందుకు రెడీ అంటున్నాడు.


సైరా మూవీ తనలో ఎక్కడలేని ధైర్యం నింపిందని, తన 150 సినిమాలు ఒక ఎత్తు అని, సైరా మూవీ మరో ఎత్తు అని చిరంజీవి చెబుతున్నారు. దాంతో చిరంజీవి ఇపుడు భగత్ సింగ్ పాత్ర మీద మూడా మోజు పెంచుకుంటున్నారు. ఈ పాత్ర చిరంజీవికి ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఇపుడు సైరా ఇచ్చిన సక్సెస్ తో భగత్ సింగ్ ని కూడా పట్టాలెక్కించాలనుకుంటున్నాడుట.


భగత్ సింగ్ పాత్ర చేయాలని తనకు ఉందని మరో మారు తన మనసులో మాట బయటపెట్టాడు. ఎవరైన నిర్మాత ఆ పాత్ర చేయాలని తనను కలిస్తే తప్పకుండా చేస్తానని చిరంజీవి అంటున్నారు. భగత్ సింగ్ పాత్రతో పాటు చత్రపతి శివాజీ పాత్ర కూడా చేసేందుకు చిరంజీవి రెడీ అంటున్నారు. నిజానికి ఈ పాత్ర వేయాలని సూపర్ స్టార్ క్రిష్ణ అనుకుని వదిలేశారు.


మరి ఆ పాత్ర తాను వేస్తామని చిరంజీవి ముందుకు రావడం అంటే గొప్ప విశెషమే. అయితే చిరంజీవి హుషార్ ని ఎవరూ కాదనలేకపోయినా కూడా ఈ రెండు సినిమాలు నిర్మించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది ఇపుడు చర్చగా ఉంది. భారీ బడ్జెట్లో తీస్తే తప్ప ఈ మూవీలు క్లిక్ కావు. అంతటి రిస్క్ ఎవరు తీసుకుంటారు. 


సైరా మూవీ కూడా బయట నిర్మాతలు వచ్చినా ఇలా చేసి ఉండలేరు కాబట్టే స్వయంగా కొడుకే నిర్మాతగా మారి తండ్రికి కానుక ఇచ్చారు. మరి చిరంజీవి మదిలో మెదిలే ఆ రెండు పాత్రలు కూడా వెండి తెర మీదకు రావాలంటే రాం చరణే నిర్మాతగా మరోసారి రిస్క్ చేయాలని అంటున్నారంతా. ఫ్యాన్స్ సైతం రాం చరణ్ తీస్తేనే   వాటిని న్యాయం జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి రాం చరణ్ త్వరలో  అనౌన్స్ చేస్తాడేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: