టాలీవుడ్ ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మికి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. స్నేహితులు బంధువులు టాలీవుడ్ నటులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మంచు లక్ష్మి తన తమ్ముడైన మనోజ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఏ ప్రోగ్రాం కి వెళ్లిన  మంచు మనోజ్ గురించి మాట్లాడుతుంది మంచు లక్ష్మి. ఎప్పుడూ చలాకీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే తన  తమ్ముడు మనోజ్ అంటే తనకి  చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పింది. 

 

 

 

 

 అయితే మంచు  మనోజ్ తన అక్క మంచు  లక్ష్మికి స్పెషల్ విషెస్ చెప్పారు.  మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు మంచు   మనోజ్. అంతేకాదు లక్ష్మి మంచు చీరలో ఉన్న ఫోటోని షేర్ చేశాడు మంచి మనోజ్ . నా ప్రియమైన సోదరీ నా డార్లింగ్ నా ఫ్రెండ్ ఆయన అక్క కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మంచు మనోజ్ తెలిపాడు. నా జీవితంలో నువ్వు బెస్ట్ థింగ్ అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్. 

 

 

 కాగా మంచు లక్ష్మి తెలుగు తమిళ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది. శ్రీనివాస్ అనే ఎన్నారై ని పెళ్లి చేసుకుంది మంచు లక్ష్మి. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో నెగటివ్ ఛాయలున్న పాత్రలో నటించి 2012లో నంది అవార్డు కూడా దక్కించుకుంది మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: