సినిమా అనే రంగుల ప్రపంచంలో అందరు ఉన్నత స్ధానానికి ఎదుగుతారని ఊహించలేం.కొందరు ఒకటి,రెండు సినిమాలకే స్టార్ స్టేటస్ పొందుతారు.మరికొందరికి ఎన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు ఉండదు.కాని ఒక సినిమా ముందు, ఓ సినిమా తరువాత హీరోయిన్‌ పరిస్థితి గురించి చెప్పుకోవాలంటే కచ్చితంగా ముందుగా గుర్తుకొచ్చేది ‘దంగల్‌’ సినిమాలోని గర్ల్‌ సన్యా మల్హోత్రానే..


ఇందులో ఫాతిమా సనాషేక్ చెల్లిలి పాత్రలో అందరినీ మెప్పించింది. ఈ సినిమాకి ముందు సన్యా ఓ సాదా సీదా అమ్మాయి. ఈ సినిమా తరువాత ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది.ఇక ఇప్పుడు ఈ బ్యూటీ విద్యాబాలన్ ‘శకుంతలా దేవి.. హ్యూమన్ కంప్యూటర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ విషయాల గురించి ఎందుకు చెబుతున్నానని ఆలోచిస్తున్నారా.  మరేంలేదండి..ఈ 27 ఏళ్ల సుందరి చేతిలో ఉన్న డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుందట.


అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే కన్‌ఫ్యూజన్‌లో వుందట. దీని కోసం డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్పాలని అడుగుతున్నారు. నాకు మీ సలహా కావాలి. ప్రాపర్టీ కాకుండా ఇంకొక చోట ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పండి  అని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీని కోరారు. ఈ ముద్దుగుమ్మ మాటలకు స్పందించిన సింఘ్వీ, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్లలో ఎక్కువ భాగాన్ని ఈక్విటీల్లో పెట్టండి. స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్‌‌ను నియమించుకోండి. అని చెప్పారట.


అలాగే సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు. రెగ్యులర్ ఆదాయం వద్దంటే ఫండ్స్‌లోనే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టండి. బంగారంలోనూ 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేయండి అని మల్హోత్రా అడిగిన దానికి సమాధానం ఇచ్చారు. ఇక గతంలో సోనాక్షి సిన్హాకు కూడా ఈయన ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చారట..ఇకపోతే సింఘ్వీ చెప్పిన దాన్ని ఈ అమ్మడు ఫాలప్ చేసి మరిన్ని డబ్బులు సంపాదించాలని ఈమె అభిమానులు కోరుకుంటున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: