చాలామందికి నటించడం అంటే పిచ్చి... ఎంత పిచ్చి ఉంటుందంటే అవకాశం ఇప్పిస్తాం అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. నటన అవకాశం కోసం ఎన్నో పాట్లు  పడుతుంటారు. ఇంకా నటన   చాన్స్ కోసం వెతుకుతున్న వాళ్ళు  అయితే... అవకాశం ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మేస్తారు. అయితే ఇలా నటనపై ఆసక్తి ఉన్నవారి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటారు కొందరు కేటుగాళ్లు. సినిమాలలో సీరియల్స్లో ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికి ఎంతో మందిని  మోసం చేశారు.  కొంతమంది నుంచి బాగా డబ్బులు దండుకుని ఛాన్స్ ఇప్పిస్తానంటూ మోసం చేసిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. 

 

 

 

 

 

 ఇక్కడ ఇంకో మహిళా ఇలాంటి కేటుగాళ్లు మోసానికి మోసపోయింది. హైదరాబాద్ రామకోటి ప్రాంతానికి చెందిన మహిళ నటిగా మోడల్ గా పనిచేస్తుంది. నటనపై చాలా ఆసక్తితో ఉన్న ఈమె చాలా ప్రయత్నాలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు ముంబైకి చెందిన అంజూ  కుమార్ అలియాస్ చక్రవర్తి అనే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తున్నారని సినిమాలు తీస్తున్నానని వ్యాపారాలు కూడా చేస్తుంటానని ఆ మహిళకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. 

 

 

 

 

 తన అసిస్టెంట్ రాకేష్ మిమ్మల్ని సంప్రదిస్తారు అంటూ ఆ మహిళకు చెప్పాడు. ఆ  కేటుగాడు చెప్పిన మాయమాటలు  నమ్మిన మహిళా తొందరలో సినిమా ఛాన్స్ రాబోతుందని కలలు కన్నది. తర్వాత అసిస్టెంట్ రాకేష్ ఆమెకి  ఫోన్ చేసి మోడలింగ్  కోసం 3000 ఆర్టిస్ట్ కార్డు  కోసం 10,000 విమానం టికెట్లు బుక్ చేయాలి అంటూ 7000 వసూలు చేశారు.  వాళ్ళ మాటలు నమ్మిన ఆ మహిళ వారు అడిగినంత ఇచ్చేసింది. అయితే ఆమె మోడల్ కంటే నటిగానే బాగుంటుందని  ఆమెకి   సీరియల్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పి మొత్తంగా లక్ష రూపాయల వరకు కాజేశారు ఈ కేటుగాళ్లు. అయితే కొన్ని రోజులు వేచి చూసిన ఆ మహిళా  ఆ తర్వాత వారం నుంచి ఫోన్ రాకపోవడంతో... అనుమానం వచ్చి వాళ్లకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో  షాక్ కి గురైంది మహిళా  . ఇక మోసపోయానని గుర్తించిన మహిళల సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: