టాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ మూవీలో నటిస్తూ బిజీ బిజీ ఉంటున్నారు విక్టరీ వెంకటేష్.  ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మద్య రిలీజ్ అయ్యింది.  మామా అల్లుళ్ల లుక్ అదిరిపోయింది. 

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ మామా అల్లుళ్లు.  ఇక మామా అల్లుళ్లు తెరపై ఎలా కనిపిస్తారో అని మొదటి నుంచి ప్రేక్షకులకు తెగ క్యూరియాసిటీ నెలకొంది.  ఆ మద్య నాగ చైతన్య నటించిన  ప్రేమమ్ సినిమాలో కొద్ది సేపు కనిపించి హడలెత్తించాడు వెంకటేష్.  తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న 'వెంకీమామ' టీజర్ దసరా సందర్భంగా ఈ ఉదయం విడుదలైంది. 


దగ్గుబాటి మామ వెంకటేష్ - అక్కినేని అల్లుడు నాగ చైతన్య మొదటిసారి బిగ్ స్క్రీన్ పై చేయబోతున్న రచ్చ  ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. వెంకీ మామ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అంచనాల తగ్గట్టుగా ఎట్రాక్ట్ చేసింది. మామ అల్లుళ్ళ యాక్షన్ అండ్ కామెడీ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. "గోదావరిలో ఈత నేర్పా... బరిలో ఆట నేర్పా... ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. రారా అల్లుడు" అంటూ వెంకటేశ్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పడం అలరించింది.

ఆపై "ఏమంటుందిరా..? ఇందాకటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే... ఐలవ్ యూ అనేసిందిరా అల్లుడూ" అన్న మరో వెంకటేశ్ డైలాగ్ కూడా ఇందులో వినిపిస్తుంది. మామా, అల్లుళ్లు బైక్ పై రావడం, జాతరలో ఫైట్ సీన్ ను కూడా కొన్ని సెకన్ల పాటు చూపించారు.  ఇక విజువల్స్ లో పూర్తిగా విలేజ్ లోలేషన్స్ ని అందంగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా సినిమా గ్లింప్స్‌ పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేసింది. సురేష్ ప్రొడక్షన్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: