విజయదశమిని దసరా అని పిలుచుకుంటాం. దశవిధాలైన పాపాలను హరించేది కాబట్టి దశహరా అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్తూంటారు. కాలక్రమంలో ఈ పేరును దసరా అనే పేరు స్థిరపడిందని అంటారు.  దసరా పండుగ రోజున రావణకుంభ కర్ణుల బొమ్మలను దహిస్తూ రావణదహనం అనీ, రామలీల అని పిలుస్తూ ఉత్సవలు జరుపుకుంటారు. దుష్టసంహారం చేసిన దుర్గామాతను పూజించుకుంటే సఖల సుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. విజయదశమి రోజున దుర్గాదేవికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

 

 

అమ్మవారు మహిషాసురుడిని కాళికాదేవి సంహరించినందున నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. ఈ పండుగ సందర్భంగా దుర్గాష్టమి రోజున జరుపుకునే ఆయుధపూజ ఎంతో ప్రసిద్ధమైనది. దుర్గాదేవి రూపంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ పర్వదినాన భక్తులు ఆయుధాలకు, వాహనాలకు పూజ జరుపుకుంటారు.  ఎవరు ఏ వృత్తిలో ఉంటే వారు తమ పరికరాలను ఈ రోజున పూజించుకుంటే అదే ఆయుధపూజ అని కూడా అంటారు. ప్రజలందరూ ఆనందంతో జరుపుకునే ఈ పండుగ సంబరాలు దేశ వ్యాప్తంగా అంబరాన్ని తాకుతూంటాయి.

 


ఉత్తరాదిన హంగామా ఓ రకంగా దక్షిణాదిన ఓ రకంగా దసరా సంబరాలు జరుగుతూంటాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తుతూంటాయి. ఉత్తరాదిన భారీ కటౌట్లు ఏర్పాటు చేసి దుర్గమ్మను పూజిస్తారు. కలకత్తాలో విజయదశమి రోజుల్లో కార్మికులు సంబరాలు చేసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక.. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా విజయదశమి పండుగను వివిధ రూపాల్లో భారీగా, ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారి ప్రభల ఊరేగింపు, తెప్పోత్సవాలతో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విజయవాడలో జరిగే ప్రతి ఏటా విజయదశమి రోజున జరిగే తెప్పోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు కూడా దేశంలో ప్రసిద్ధమైనవి. భక్తులంతా ఎంతో ఉత్సాహంతో ఈ ఉత్సవాలను తిలకిస్తూంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: